కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆ పార్టీ రథసారథి రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై గుర్రుగా ఉన్నారా? ఓవైపు పార్టీ నేతల ఆహ్వానాలకు నో చెప్తూ మరోవైపు వారికి ఎలాంటి పదవులు కట్టబెట్టకుండా ఉండటం వెనుక నాయకుల పోరాటపటిమపై నమ్మకం లేకపోవడం, వారి అనైక్యతే కారణమా? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల నుంచి వస్తోంది.
రాహుల్ అధ్యక్షుడయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లింది. ఈ క్రమంలోనే ఆయన్ను రాష్ర్టానికి రప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. తెలంగాణలో బహిరంగ సభను నిర్వహించాలనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ నేతలు చేశారని వార్తలు వచ్చాయి. తెలంగాణలో కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా రాహుల్ సభను పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరి ప్రతిపాదనలకు రాహుల్ అంగీకరించలేదు. అనంతరం సమ్మక్క సారలమ్మ జాతరకు రాహుల్ ను ఆహ్వానించారు. కానీ ఆయన దానికి గైర్హాజరయ్యారు. ఇక తాజాగా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీని తొలగించి నూతన కమిటీ వేసిన సందర్భంగా కూడా రాహుల్ తెలంగాణ నేతల్లో ఒక్కరంటే ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. అలా అని తెలంగాణలో బలమైన నాయకులను ఆ పార్టీ కలిగి లేదా అంటే..పలువురు మహామహులు ఉన్న విషయం విదితమే.
సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు ఎస్.జైపాల్ రెడ్డి - సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి - టీపీసీసీ ఛీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య - కోమటిరెడ్డి బ్రదర్స్ - డీకే.అరుణతో పాటు మరికొందరు నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయినప్పటికీ...వీరికి ఆ పోస్టుల్లో చోటు దక్కలేదు. ఇందుకు అధిష్టానం వద్ద ఉన్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ కారణమంటున్నారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ సిఎం పదవి కోసం నాయకుల మధ్య పోటీ - అనైక్యత కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆ తరువాత కూడా నాయకులు ఎవరికివారే అనే రీతిలో వ్యవహరించారు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత టీపీసీసీ పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడ్డారు. వీటిని గమనించి...నాయకుల అహం - ఆధిపత్య సమస్యలను పక్కనబెట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు, ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలనే లక్షంతో పనిచేయాలనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ...దాన్ని పాటిస్తున్న వారు కొందరేననే భావన కూడా ఢిల్లీ వర్గాల్లో ఉన్నట్లు టాక్. అందుకే ఢిల్లీ పెద్దలు ముఖ్యంగా రాహుల్ తెలంగాణ నాయకులకు చోటు కల్పించలేదని అంటున్నారు.