నో న‌మ్మ‌కం; జానాను రాహుల్ అలా అడిగేశారా?

Update: 2015-07-16 08:51 GMT
అధికారంలో ఉన్న‌ప్పుడు క‌ళ‌క‌ళ‌లాడిన కాంగ్ర‌స్ పార్టీ.. అది కాస్తా చేజారిన వెంట‌నే ఎవ‌రికి వారు త‌మ దారి తాము చూసుకుంటున్న ప‌రిస్థితి. మిగిలిన పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. కాంగ్ర‌స్ అదినాయ‌క‌త్వానికి ఈ వ్య‌వ‌హారం ఎంత ఇబ్బందిగా ఉంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌దేళ్ల సుదీర్ఘ‌కాలం ప‌వ‌ర్ చేతిలో ఉండి.. అది కాస్తా చేజారిపోవ‌టం.. స‌మీప భ‌విష్య‌త్తులో ప‌వ‌ర్ చేతికి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌న్న అంచ‌నాలు పార్టీ నేత‌ల్ని తెగ ఇబ్బంది పెడుతున్నాయి.

దీంతో.. కాలానికి త‌గ్గ‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకుంటూ.. ఎవ‌రి దారి వారు చూసుకుంటున్న ప‌రిస్థితి. తాజాగా కాంగ్రెస్ యువ‌రాజును రాహుల్‌ను తెలంగాణ కాంగ్రెస్ సార‌థి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి.. షబ్బీర్‌.. జానారెడ్డిలు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆ మాట‌.. ఈ మాట అయ్యాక‌.. జానారెడ్డిని రాహుల్ సూటిప్ర‌శ్న ఒక‌టి వేశార‌ట‌.

మీరు పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అని అడిగేశార‌ట‌. జానారెడ్డి లాంటి సీనియ‌ర్ నేత గురించి రాహుల్ అలా అడిగేయ‌టంతో జానాతో స‌హా మిగిలిన వారు షాక్ తిన్న ప‌రిస్థిత‌ని చెబుతున్నారు. డీఎస్ లాంటి నేత పార్టీ విడిచి వెళ్లిపోయిన నేప‌థ్యంలో.. ఎవ‌ర్ని న‌మ్మాలో.. ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో అర్థం కావ‌టం లేద‌ని.. అందుకే అడిగిన‌ట్లుగా రాహుల్ వివ‌రించార‌ని చెబుతున్నారు.

కాంగ్రెస్ నుంచి డీఎస్ టీఆర్ ఎస్ లోకి వెళ్లిన స‌మ‌యంలో జానారెడ్డి కూడా పార్టీ మారటం ఖాయ‌మ‌న్న మాట వినిపించింది. ఆ మాట రాహుల్ చెవిన కూడా ప‌డిన‌ట్లుగా భావిస్తున్నారు. జానారెడ్డి లాంటి పెద్ద మ‌నిషిని ప‌ర్స‌న‌ల్ గా ఉన్న‌ప్పుడు కాకుండా.. న‌లుగురి మ‌ధ్య అలా అడిగేయ‌టం జానా కాస్తంత నొచ్చుకున్న‌ట్లు స‌మాచారం. రాహుల్ ప్ర‌శ్న‌కు స్పందించిన జానా.. తాను పార్టీ మారే ఆలోచ‌న లేద‌ని.. పార్టీతోనే ఉంటాన‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. జానా లాంటి సీనియ‌ర్‌కు రాహుల్ వేసిన ప్ర‌శ్న బాధ క‌లిగించ‌టం ఖాయం అంటున్నారు. చూస్తుంటే.. న‌మ్మ‌కం లేని నేత‌ల‌తో పార్టీ న‌డుపుతున్న‌ట్లుగా రాహుల్ ఫీల్ అవుతున్న‌ట్లుంది.
Tags:    

Similar News