దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇది. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ వయసు 132 ఏళ్లు. రాహుల్ గాంధీ వయసు 47 ఏళ్లు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు ఇవాళ రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. మరి ఆ పార్టీని రాహుల్ బలోపేతం చేస్తారా లేదా? ఇప్పుడు రాహుల్ విషయంలో కలుగుతున్న సందేహం కూడా ఇదే!
దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిలిచింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 20 శాతం మాత్రమే పాపులర్ ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో మోడీ సారథ్యంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే 543 సీట్లలో 8 శాతం మాత్రమే ఆ పార్టీ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది అత్యంత పేలవమైన ప్రదర్శన. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సుమారు ఆరు రాష్ర్టాల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం పెద్ద రాష్ర్టాలైన కర్ణాటక, పంజాబ్‌లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. మరో మూడు చిన్న రాష్ర్టాలు కూడా కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల ఎన్నికల్లో ఆ పార్టీ గెలుస్తుందన్న ఆశలు కూడా అంతగా లేవు.
2009 నుంచి 2014 వరకు క్రమంగా ప్రజలు కాంగ్రెస్‌కు దూరం అవుతూ వచ్చారు. ఆ సమయంలో సుమారు 9 శాతం పాపులర్ ఓటును ఆ పార్టీ కోల్పోయింది. వివిధ కులాలు, మైనార్టీల మద్దతును కోల్పోయింది. తమిళనాడులో 1962లో కాంగ్రెస్ చివరిసారి గెలిచింది. వెస్ట్ బెంగాల్‌లో 1977 నుంచి ఆ పార్టీ అధికారంలో లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లోనూ ఆ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఈ దశలో రాహుల్ గాంధీ పార్టీ భవిష్యత్తును మార్చేస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి రాహుల్ 13 ఏళ్ల క్రితం అమేథీ నుంచి పబ్లిక్ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. కానీ చాన్నాళ్లూ సైలెంట్‌గానే ఉన్నారు. 2013లో రాహుల్ పార్టీలో రెండవ సీనియర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయినా అప్పటి నుంచి ఆ పార్టీలో పెద్దగా మార్పురాలేదు. పార్టీలో వ్యవస్థాగత మార్పులకు రాహుల్ కృషి చేశారు. కానీ ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోయింది.
ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ టాప్ ప్లేస్‌ను ఆక్రమించారు. ఇది పార్టీ వర్గాల్లో కొంత కొత్త ఉత్సాహాన్ని నింపనున్నది. కానీ ఆయన అనుసరించే రాజకీయ వ్యూహాలే ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తుగా మారుతుంది. గుజరాత్, హిమాచల్ ఫలితాలు మరి రాహుల్‌కు అనుకూలంగా మారుతాయా లేదా వేచి చూడాల్సిందే. ప్రస్తుత యువతను రాహుల్ రాజకీయాల వైపు ఎలా లాగుతారన్నది మరో సందేహం. ఒక స్పష్టమైన లక్ష్యంతో రాహుల్ యువ నేతలను ఆకర్షిస్తే, ఆ పార్టీకి ఆశించినంత భవిష్యత్తు ఉంటుంది. మరి రాహుల్ ఏం చేస్తారో!