దేశంలో 2024లో పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఇందుకోసం ఇప్పటికే ఆయన భారత్ జోడో యాత్ర కోసం శ్రీకారం చుట్టారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ముగిసింది. ఇప్పుడు భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తన జోడో యాత్రలో ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో పాదయాత్రను ముగించారు. ఆరో రాష్ట్రం మహారాష్ట్రలో పాదయాత్ర చేస్తున్నారు. మొత్తం 3500 కిలోమీటర్లకు పైగా రాహుల్ జోడో యాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.
కాగా రాహుల్ గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వివిధ వర్గాల ప్రజలు, రైతు కూలీలు, వలస కూలీలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, వివిధ సంఘాల వ్యక్తులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు రాహుల్ గాంధీతో అడుగులో అడుగేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు సైతం రాహుల్ గాంధీని చూడటానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయనతోపాటు పరుగులు తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా తన యాత్రలో అన్ని మతాల ప్రార్థనా స్థలాలను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రతిసారీ హిందుత్వను క్యాష్ చేసుకుని విజయం సాధిస్తుండటం, హిందూ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్‌ను చిత్రీకరిస్తుండటంతో ఈసారి రాహుల్ గాంధీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు రాహుల్ గాంధీ సైతం దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే నుదుటిన విభూతి, నామాలు, కుంకుమ బొట్టు ధరిస్తున్నారు. తద్వారా బీజేపీ హిందుత్వ విధానాలను సమర్థంగా అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారు.
తాజాగా నుదిటిన విభూతి నామాలు, కుంకుమ ధరించి తెల్లగడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ చిత్రమొకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హిందుత్వ లుక్కులో రాహుల్‌గాంధీ పూర్తి ఆధ్మాత్మికతతో కనిపిస్తున్నారని అంతా అభిప్రాయపడుతుండటం విశేషం.
విభూతి, కుంకుమ ధరించి ఉన్న రాహుల్ గాంధీ చిత్రాన్ని పలువురు కాంగ్రెస్ అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాలకు డీపీలుగా పెట్టుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే హిందువులను ఆకట్టుకోవడానికి.. భారీగా ఈసారి ఓట్లు కొల్లగొట్టడానికి రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నమే చేస్తున్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.