బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్లు తమ నోరును అదుపులో పెట్టుకోవడం ఎంత అవసరమో అనేక ఉదంతాల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కొందరు నోరు జారుతుంటారు. రాజకీయ ప్రత్యర్థి అనేది కూడా మరిచిపోయి చేసిన ఇలాంటి కామెంట్ కారణంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కూడా!
ఇంతకీ ఏం జరిగిందంటే... మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోడీని ఉద్ధేశిస్తూ 'నీచ్ ఆద్మీ'గా పేర్కొన్న విషయం తెలిసిందే. గుజరాత్ ప్రసంగంపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మీడియాలో ప్రసారం కావడంతో కలకలం రేగింది. నీచ్ ఆద్మీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందిస్తూ..`వాళ్లు నన్ను నీచ్‌గా పిలుస్తున్నారు. అవును నేను సమాజంలోని పేద తరగతి నుంచి వచ్చాను. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల ఉన్నతికి ప్రతి క్షణం పాటుపడ్డాను. వాళ్లు నన్ను నీచ్‌గా పిలవనీయండి. దానిపై స్పందించొద్దు. వారి ప్రవర్తనకు మనం కృతజ్ఞతలు తెలుపుదాం. 9వ, 14వ తేదీల్లో జరిగే పోలింగ్‌లో ఓట్ల ద్వారా మన పనితనాన్ని సమాధానంగా ఇద్దాం` అని సూరత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ పేర్కొన్నారు.
మరోవైపు ప్రధాని మోడీని 'నీచ్ ఆద్మీ'గా పేర్కొనడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు కోరాతారని అనుకుంటున్నట్లు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. `కాంగ్రెస్ పార్టీపై దాడి చేసేందుకు బీజేపీ, పీఎం ఎప్పుడూ అసభ్య భషను ఉపయోగిస్తారు. కానీ కాంగ్రెస్ అటువంటి సాంప్రదాయానికి దూరం. కాంగ్రెస్‌కు ప్రత్యేక సంస్కృతి, వారసత్వం ఉంది` అని అన్నారు. ప్రధాని మోడీని ఉద్ధేశిస్తూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఉపయోగించిన భాషను వ్యక్తిగా తాను, పార్టీగా కాంగ్రెస్ ఖండిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
కాగా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశించిన కాసేపటికే మణిశంకర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ క్షమాపణలు కోరారు. నీచ్ ఆద్మీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. హిందీ తన మాతృ భాష కాదన్నారు. నీచ్ ఆద్మీ అంటే ఇంగ్లీష్‌లో తక్కువస్థాయి అనుకున్నా. తన వ్యాఖ్యలు వేరే అర్థం ఇచ్చేలా ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆయన తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచి ఇప్పటివరకు నరేంద్రమోడీని తాను ఎప్పుడూ ఛాయ్‌వాలా అనలేదని అయ్యర్ అన్నారు. ఇదే విషయాన్ని తన పాత ప్రసంగాల వీడియో ద్వారా తెలుసుకోవచ్చన్నారు.