తన జీవిత భాగస్వామిపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-29 05:38 GMT
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన యాత్ర వివిధ రాష్ట్రాలను దాటుకుంటూ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఒక యూట్యూబ్‌ చానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి ఎప్పుడని అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ రాహుల్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.  నానమ్మ (ఇందిరా గాంధీ) వంటి సుగుణాలున్న మహిళ అయితే తనకు అభ్యంతరం లేదన్నారు. కానీ, అమ్మ (సోనియా గాంధీ), నానమ్మ (ఇందిరా గాంధీ)లో  ఉన్న మిశ్రమ లక్షణాలు కలిగినవారైతే ఇంకా మంచిది అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.

అలాగే ఈ ఇంటర్వ్యూలో తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి రాహుల్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. నానమ్మ అంటే తనకెంతో ప్రేమని అన్నారు. ఆమె తనకు మరో తల్లిలాంటిదని రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యారు.

అలాగే వాహనాలపై తన అభిరుచులను రాహుల్‌ గాంధీ బయటపెట్టారు. తనకు కార్లపై అంతగా మోజు లేదన్నారు. సొంత కారు కూడా లేదని చెప్పారు.  ఇంట్లో సీఆర్‌–వీ ఉన్నా.. అది తన తల్లిదని తెలిపారు. కార్లంటే అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ వాటికి వచ్చే సాంకేతిక సమస్యలు మాత్రం తనకు 90 శాతం తెలుసని రాహుల్‌ చెప్పడం విశేషం. కార్లను రిపేర్‌ చేస్తానని తెలిపారు. అలాగే తనకు వేగంగా వెళ్లడం ఇష్టమని వెల్లడించారు. గాలిలో, నీటిలో, నేలమీద వేగంగా దూసుకెళ్లడానికే ఇష్టపడతానని వివరించారు.

ఇక బైకులపైనా రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫీల్డ్‌ నచ్చదన్నారు. దాన్ని నడపాలంటే చాలా కష్టమన్నారు. అలాగే చాలా ప్రమాదం కూడా రాహుల్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ బైక్‌ బ్రేకులు లేదా బ్యాలెన్స్‌ అంటే ఎంతోమందికి ఇష్టమని.. కానీ తనకు మాత్రం ఆర్‌1 కంటే ఎక్కువగా ఓల్డ్‌ లాంబ్రెట్టా చాలా ఇష్టమన్నారు. లండన్‌లో తాను పనిచేసే కాలంలో అప్రిలియా ఆర్‌ఎస్‌ 250 బైక్‌ ఉండేదని రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. అదంటే తనకు అమితమైన ప్రేమ అని వెల్లడించారు.

ఇదే ఇంటర్వ్యూలో రాహుల్‌ గాంధీ తనను పప్పూ అంటూ ప్రత్యర్థులు చేసే విమర్శలపైనా స్పందించారు. అదొక చెడు ప్రచారమని వ్యాఖ్యానించారు. తనను తిట్టినా.. కొట్టినా.. తాను మాత్రం ఎవరినీ ద్వేషించను అని తెలిపారు.  వారి జీవితంలో ఏదీ జరగక, జీవితంలో బంధుత్వాలు సరిగా లేక కొందరు ఎదుటివారిని దూషిస్తుంటారని రాహుల్‌ వెల్లడించారు. ఇలాంటి వారు తనకు ఎన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను అని పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News