టికెట్ల కోసం ఎవరూ ఢిల్లీకి రావొద్దు.. రాహుల్ వార్నింగ్
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఆయన తెలంగాణ పర్యటన ముగిసిందని చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆయన స్వరం గంభీరంగా మారటమే కాదు.. ఎలాంటి మొహమాటం లేకుండా సూటిగా చెప్పాల్సింది చెప్పేశారు. అంతేనా.. పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశంతో పాటు.. పలు అంశాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అదేసమయంలో తరచూ జరిగే తప్పుల్ని ప్రస్తావిస్తూ.. వాటిని దిద్దుకోవాలని చెప్పటమే కాదు.. కొన్ని హెచ్చరికల్ని జారీ చేశారు.
పార్టీ నేతల మధ్య గ్రూపులతో బండి లాగించే అలవాటున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఆ విధానం నుంచి బయటపడాలని భావిస్తుందా? అన్న భావన కలిగేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని.. ఈసారి ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తాయని చెబుతున్నారు. తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామంటున్న రాహుల్.. ఇందుకోసం పార్టీ నేతలు అనుసరించాల్సిన పలు అంశాల్ని ప్రస్తావించటం గమనార్హం.
ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుందే తప్పించి.. పైరవీలతో కాదన్నారు. ఇందులో భాగంగా టికెట్ల కోసం ప్రజలు.. రైతుల తరఫున పోరాటం చేసే వారికే టికెట్లు ఇస్తామని చెప్పిన రాహుల్.. ఢిల్లీకి రావొద్దని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కూర్చున్నా.. ఢిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావని స్పష్టం చేసిన రాహుల్.. టికెట్ల కోసం గ్రామాల్లోకి వెళ్లి పని చేయాలన్నారు. ఢిల్లీకి మాత్రం రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చేశారు. బ్యాక్ డోర్ నుంచి (సిఫార్సులు.. లాబీయింగ్) టికెట్లు తెచ్చుకుంటామనే వారు ఆ ఆశల్ని వదులుకోవాలని చెప్పటం విశేషం.
తనకు తెలంగాణ గురించి.. హైదరాబాద్ గురించి బాగా తెలుసన్న ఆయన.. హైదరాబాద్ బిర్యానీ.. ఛాయ్ ఎంత బాగుంటుందో చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో ప్రజలు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. కుటుంబంలోని వ్యక్తుల మధ్య విభేదాలు సహజమని.. అంత మాత్రాన రోడ్డుకెక్కటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించిన ఆయన.. విభేదాలు ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం కానీ మీడియా ముందుకు మాత్రం వచ్చి చెప్పొద్దన్నారు. తాను ప్రతి ఒక్కరి మాటను వింటానని.. అభిప్రాయాల్ని తెలుసుకుంటానని చెప్పారు. నేతలందరి కృషి వల్ల వరంగల్ సభ సక్సెస్ అయ్యిందన్న ఆయన అందుకు అందరికి థ్యాంక్స్ చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రంలో సోనియమ్మ కలగన్నది కాలేదని.. అందరి ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేళ్లుగా ఆరాచక పాలన సాగుతుందన్న ఆయన.. రాష్ట్ర సంపదంతా ఒక కుటుంబం దోచుకుంటోందన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. ఏమైనా గతంలో లేని పదును రాహుల్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. మాటలైతే మారాయి.. మరి చేతల్లోనూ మార్పు వస్తే కాంగ్రెస్ లో కొత్త రాజకీయం మొదలైనట్లేనని చెప్పాలి.