ఇప్పటికే ఎన్నో రాజకీయ సంచలనాలకు కారణమైన ఓటుకు నోటు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని టేకప్ చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. పార్లమెంటులో దీన్ని ప్రస్తావించటంతో పాటు.. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ.. దీనికి సూత్రధారి ఎవరన్న విషయంపై ఇప్పటివరకూ ఎందుకు తేల్చలేదంటూ రానున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిలదీయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టటంతోపాటు.. ఈ వ్యవహారంలో కేంద్రం సైతం పరోక్షంగా సాయం చేసిందన్న విమర్శల నేపథ్యంలో.. వారిని ఇరుకున పెట్టేందుకు ఓటుకు నోటు వ్యవహారం ఒక అస్త్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం.. తెలంగాణ.. ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలతో విడివిడిగా భేటీ అయిన రాహుల్.. ఓటుకు నోటు వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన మిగిలిన వివరాలు సేకరించాలని.. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని తాను ప్రస్తావిస్తానని.. దీనిపై సీబీఐ విచారణకు పట్టుపట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో వీడియో.. ఆడియో సీడీలు విడుదలైనప్పటికీ.. ఇంతవరకూ ఈ వ్యవహారానికి సూత్రధారి ఎవరన్న విషయంపై ఎందుకు దర్యాప్తు ముందుకు సాగటం లేదన్న కోణంలో నిలదీయాలని నిర్ణయించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇంతవరకూ పెద్దగా పట్టనట్లుగా ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో ప్రస్తావించి. . ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచనలో ఉండటం గమనార్హం.