కాంగ్రెస్ పార్టీ యువరాజు.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు.. భవిష్యత్ సారథి అయిన రాహుల్ గాంధీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయనకు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఆయనకు చెందిన ట్విట్టర్ ఖాతాను గుర్తు తెలియని వారు హ్యాక్ చేయటంతో పాటు.. అందులో కొన్ని ట్వీట్లు చేశారు.
రాహుల్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే వారు వెంటనే అలెర్ట్ అయి.. యువరాజు వారి అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించి. వెనువెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి 8.45 గంటల సమయంలో రాహుల్ అకౌంట్లోకి హ్యాకర్లు చొరబడి ఆయన ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే.. హ్యాక్ చేసిన వారు పెట్టిన ట్వీట్లను వెనువెంటనే తొలగించే ప్రయత్నం చేశారు.
హ్యాకర్లు రాహుల్ అకౌంట్లో అసభ్యకరమైన ట్వీట్లను పోస్ట్ చేశారు. వీటిని గుర్తించిన వెంటనే రాహుల్ గాంధీ కార్యాలయ సిబ్బంది ఈ ట్వీట్లను వెంటనే తొలగించారు. రాహుల్ టీంకు చెమటలు పట్టించిన ఈ ఉదంతం కాంగ్రెస్ వర్గాల్లోనూ.. రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/