కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర చేసేటప్పటికి రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ దారికొచ్చేశారు. అలాగే గెహ్లాట్ మద్దతుదారులు కూడా అధిష్టానానికే జై కొడుతున్నారు. అధిష్టానం ఎలాచెబితే అలాగే నడుచుకుంటామని ప్రకటనలిస్తున్నారు. అధిష్టానాన్నే థిక్కరించి అంతా తమిష్టప్రకారమే చేసుకుంటామని గంభీరంగా ప్రకటనలిచ్చి, అధిష్టానాన్నే చాలెంజ్ చేసిన మంత్రులు, ఎంఎల్ఏలంతా ఎందుకని యూటర్న్ తీసుకున్నారు ?
ఎందుకంటే గెహ్లాట్ తో పాటు ఆయన వర్గం వైఖరికి సోనియాగాంధీతో పాటు సీనియర్లందరికీ మండిపోయింది. సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో అభిప్రాయాలు తీసుకోవాలన అధిష్టానం అనుకున్నది.
అయితే సీఎల్పీ సమావేశానికి పోటీగా అనధికారికంగా మంత్రులు, ఎంఎల్ఏలంతా మరో సమావేశం పెట్టుకున్నారు. తమకు అధిష్టానం గెహ్లాట్ అనే అర్ధంవచ్చేట్లుగా ప్రకటనలిచ్చారు. తమ అభిప్రాయాలను కాదని ఢిల్లీ నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాము రాజీనామాలకు రెడీగా ఉన్నట్లు బెదిరించారు.
దీన్ని అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నది. ఈ మొత్తానికి కారణం గెహ్లాట్ మాత్రమే అని గ్రహించింది. దాంతో ఇద్దరు మంత్రులు శాంతి ధరీవాల్, మహేష్ జోషి, ఎంఎల్ఏ ధర్మేందర్ రాథోడ్ కు షోకాజ్ నోటీసిచ్చింది.
పార్టీ క్రమశిక్ష ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని 10 రోజులు గడువిచ్చింది. ఇదే సమయంలో అద్యక్ష ఎన్నికకు గెహ్లాట్ ను దూరంగా ఉంచాలని కూడా సోనియా డిసైడ్ అయ్యారు. ఇందుకనే గెహ్లాట్ కు ప్రత్యామ్నాయంగా మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. దాంతో విషయం అంతా సీఎంకు అర్ధమైపోయుంటుంది.
అధిష్టానాన్ని థిక్కరిస్తే ఏమవుతుందో గెహ్లాట్ కు బాగా తెలుసు. అందుకనే ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. మంత్రులు, ఎంఎల్ఏల సమావేశం విషయంలో తన ప్రమేయం లేదని చెబుతున్నారు. సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడుంటానని ప్రకటించారు. సోనియా, మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ను కలిసి క్షమాపణలు చెప్పుకున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో గెహ్లాట్ వర్గం కూడా నోరిప్పేందుకు సాహసించటంలేదు. కాబ్టటి తదుపరి సీఎంగా సచిన్ పైలెట్ కు మార్గం సుగమమైనట్లేనా ?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.