అభినందన్‌ జీవితం ఇకనుంచి పాఠం

Update: 2019-03-05 13:25 GMT
పాకిస్తాన్‌ ఎఫ్‌ 16ని కూల్చి స్టార్‌ అయ్యాడు అభినందన్‌ వర్ధమాన్‌. పాకిస్తాన్‌ లో పడినా కూడా తన మాతృదేశ రహస్యాల్ని చెప్పే ప్రసక్తే లేదంటా ధైర్యంగా చెప్పిన అభినందన్‌.. రాత్రికిరాత్రి సూపర్‌ స్టార్ అయ్యాడు. చాలామందికి ఇన్‌ స్పిరేషన్‌ ఇచ్చాడు. అభినందన్ చూపిన తెగువ - చావు కళ్లముందే కన్పిస్తున్నా అతను చూపించి ధైర్యం.. చాలామంది రాజకీయ నాయకులను ఆకట్టుకుంది. దీంతో అభినందన్‌ లాంటి ఇన్‌స్పైరింగ్‌ పర్సనాలిటీ గురించి ఇప్పటి తరానికి - అలాగే రాబోయే తరానికి కూడా కచ్చితంగా తెలపాల్సిన బాధ్యత ఉందని ఫీలైంది రాజస్థాన్ సర్కార్‌. అందుకే.. అభినందన్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించుకుంది.

అభినందన్‌ తన చిన్నతనంలో రాజస్థాన్‌ లో చదువుకున్నాడు. రాజస్థాన్‌లో చదువుకుని ఆ తర్వాత ఎయిర్‌ ఫోర్స్‌ లో వింగ్‌ కమాండర్‌ అయ్యాడు. దీంతో.. అతని జీవితాన్ని పాఠ్యాశంగా చేర్చబోతున్నట్లు ప్రకటించారు రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ డొటార్సా. మొదట పుల్వామా దాడిని పాఠంగా చేర్చాలని అనుకున్నారు. కానీ దాడి కంటే దాడి తర్వాతే జరిగిన పరిస్థితుల్లో చిన్నారుల్లో  ధైర్యాన్ని నూరిపోస్తాయని అక్కడి ప్రభుత్వం భావించింది. దీంతో.. అభినందన్‌ జీవితాన్ని తమ పుస్తకాల్లో పాఠంగా మార్చాలని భావిస్తోంది. ఇప్పటికే అభినందన్ జీవితాన్ని సినిమాగా తీసేందుకు సంజయ్‌ లీలా భన్సాలీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో జాన్‌ అబ్రహాం హీరోగా నటిస్తున్నాడు.
Tags:    

Similar News