రాజస్థాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం చివరకు బీజేపీకి అడ్వంటేజ్ మారి రాష్ట్రపతి పాలనకు దారితీసేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , స్పీకర్ సి.పి.జోషిల మొండిపట్టుతో కాంగ్రెస్ ఖాతాలోంచి రాజస్థాన్ కనుమరుగయ్యేలా ఉంది. స్పీకర్ జోషి వద్ద దాదాపు 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. సచిన్ పైలెట్ ను కొత్త ముఖ్యమంత్రిగా చేయవద్దని వారంతా ఈ నిరసన తెలిపారు. దీంతో దీన్ని అవకాశంగా తీసుకొని రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందా అనే ఊహాగానాలు రాష్ట్రంలో జోరందుకున్నాయి.
రాజస్థాన్‌లో గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలెట్ వార్ తో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ గందరగోళంలో పడింది. దీంతో బీజేపీ వేచి చూసే విధానాన్ని అవలంబిస్తోంది. అక్కడ రాష్ట్రపతి పాలన దిశగా బీజేపీ యోచిస్తోంది. సచిన్ పైలట్ ప్రతిష్టంభన ముగించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాకరిస్తుండడంతో కాషాయ పార్టీ పావులు కదుపుతోంది.
కాషాయ పార్టీ నేతలు స్పీకర్ సీపీ జోషి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. జోషి తదుపరి కదలికను బట్టి రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ కాచుకు కూర్చుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే రాజస్థాన్ రాజకీయాలపై సీనియర్ నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇప్పటికే 90 శాతం మంది ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని శాసనసభలో బీజేపీ ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ మొత్తం పరిస్థితిని గమనిస్తోందని ఆయన అన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించాలని సోమవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష ఉపనేత ఇద్దరూ పట్టుబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా, స్పృహతో రాజీనామాలు చేస్తే.. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ఆమోదించి ఉండాల్సిందని.. కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సచిన్ పైలట్‌కు బీజేపీ తలుపులు మూయలేదని, దీనిపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్‌దేనని, అలాంటి పరిస్థితి వస్తే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. సచిన్ పైలెట్ ను లాగి అయినా సరే రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ అధిష్టానం అతడికి ఆఫర్లు ఇస్తున్నట్టు సమాచారం.
ఇంతలో ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ మాట్లాడుతూ.. బంతి ఇంకా స్పీకర్ కోర్టులోనే ఉందని.. ఆయన ఎదుటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని.. సభ్యులు రాజీనామా చేస్తేనే అని అసెంబ్లీ నిబంధనల ప్రకారం స్పీకర్ ఆమోదించాలి.. ఆ రాజీనామాలను శాసనసభ స్పీకర్ తన విధి ప్రకారం ఆమోదించిన రోజు బీజేపీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది.. కాంగ్రెస్ ఆట ముగుస్తుంది." అని ఆయన ముందే హెచ్చరికలు పంపించారు.
సచిన్ పైలట్‌ను కూడా బీజేపీ నెత్తినపెట్టుకుంటోంది. "గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఎటువంటి తప్పుడు ప్రకటన చేయనందుకు పైలట్ ను అభినందిస్తాను. అతన్ని బీజేపీలోకి పిలిచినా రాకుండా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇంత. జరిగినప్పటికీ, అతను తన సహనాన్ని కాపాడుకున్నాడు.. మౌనంగా ఉన్నాడు ఇప్పటికైనా బీజేపీలోకి రావచ్చు అంటూ బీజేపీ నేతలు ఓఫెన్ గానే అతడికి ఆఫర్ ఇస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు యోచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.