తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తన మార్క్ ట్వీట్లు చేశారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. మనసుకు తోచింది మాట్లాడటం తనకు అలవాటుగా చెప్పే ఆయన.. తాజాగా బాహుబలి 2 మీద చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సరికొత్త దుమారానికి తెర తీసేలా ఉన్నాయని చెబుతున్నారు. మొదట్నించి బాహుబలి 2ను వెనకేసుకొస్తున్న వర్మ.. తాజాగా ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేసేలా వ్యాఖ్యలు చేయటం బాగానే ఉన్నా.. మిగిలిన హీరోల్ని తక్కువ చేసేలా.. వారి అభిమానులు నొచ్చుకునేలా కుల ప్రస్తావన తీసుకురావటం ఇప్పుడు చర్చగా మారింది.
టాలీవుడ్ లో కులాల కుమ్ములాటలు ఉన్నట్లుగా ప్రస్తావించిన వర్మ తన తాజా ట్వీట్లలో.. కొంతమంది హీరోలు కాపుల మీద.. కమ్మల మీద దృష్టి పెట్టినట్లుగా ప్రభాస్ కూడా రాజుల మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంటే అతడో ప్రాంతీయ హీరోగా మాత్రమే మిగిలిపోయేవాడని.. అలా చేయకపోవటం వల్లే అతనో అంతర్జాతీయ స్టార్ అయ్యాడని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ అభిమానుల గురించి ప్రభాస్ పట్టించుకోడు కాబట్టే.. అతడు జాతీయ అంతర్జాతీయ అభిమానులను సొంతం చేసుకున్నాడని.. ప్రాంతీయ అభిమానుల గురించి పట్టించుకునే స్టార్లు ఎప్పటికీ ప్రాంతీయంగానే ఉండిపోతారన్నారు. నార్త్‌కు చెందిన ఓ వ్యక్తి.. హిందీ సినిమాలో తొలిసారి సౌత్ హీరో మిగిలిన నార్త్ హీరోలను హీరోయిన్ల మాదిరి కనపడేలా చేశాడంటూ కామెంట్ చేయటాన్ని వర్మ తప్పు పట్టారు.
నార్త్.. సౌత్ అంటూ వేర్వేరుగా చూడొద్దని.. ఇండియన్ సినిమా అంటూ ఒద్దికగా మాటలు చెప్పినట్లుగా కనిపించినా.. వర్మ వ్యాఖ్యల వెనుక మర్మం వేరే ఉందన్న వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/