క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటాన్ని షురూ చేసిన శ్రీరెడ్డి ఎపిసోడ్ లోకి విలక్షన దర్శకుడు వర్మ ఎంట్రీ ఇవ్వటమే ఒక సంచలనమే అయితే.. ఇప్పడీ వ్యవహారం పవన్ వర్సెస్ వర్మగా.. పవన్ వర్సెస్ మీడియాగా మారిన పరిస్థితి. ఆచితూచి మాట్లాడుతున్నట్లు చెప్పే పవన్..తన మాటలకు భిన్నంగా ఈ మధ్యన ఆయన ట్వీట్లు ఉంటున్నాయి.
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించిన పవన్ తన తల్లిని అవమానించారంటూ మండిపడుతున్న సంగతి తెలిసిందే. తన తల్లిని ఉద్దేశించి అసభ్యకర రీతిలో చేసిన వ్యాఖ్యను అదే పనిగా టీవీ ఛానళ్లలో ప్లే చేయటం.. ప్రత్యేక డిబేట్లు పెట్టటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.
పవన్ తల్లిని తిట్టేలా తానే సలహా ఇచ్చినట్లుగా వర్మ వెల్లడించి సంచలనం సృష్టించారు. దీంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లైంది. శ్రీరెడ్డి ఇష్యూ వరకూ కామ్ గా ఉన్న పవన్.. ఎప్పుడైతే వర్మ ఎంట్రీతో తన స్పీడ్‌ను పెంచేశారు. గుండెల్లోని ఆవేశమంతా ఒక్కసారిగా బద్ధలైనట్లుగా ఆయన తన వరుస ట్వీట్లతో.. ఘాటు విమర్శలు.. ఆరోపణలు గుప్పించటం మొదలు పెట్టారు. ఇది వర్మకే సరిపెట్టకుండా మీడియా అధినేతల మీద కూడా వార్ షురూ చేశారు. దీంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లైంది.
తాజాగా తన టార్గెట్ గా మారిన తన వ్యతిరేక మీడియా మీద పోరాడుతున్న పవన్.. తాజాగా ట్వీట్లతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్ కు సంబంధించిన ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఐదేళ్ల క్రితం నాటిది కావటం.. ఇప్పటికే పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయినది కావటం గమనార్హం.
తానిక పవన్ పై విమర్శ చేయనని.. తన తల్లిపై వేసిన ఒట్టును మరోసారి పక్కన పెట్టి మరీ పవన్ కు ఘాటు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. పక్కదోవ పట్టిస్తున్న వెధవల్ని పక్కన పెట్టి వాస్తవాల్ని గ్రహించాలంటూ సలహా ఇచ్చారు. టీవీ9 రవిప్రకాశ్ పై పవన్ విడుదల చేసిన వీడియో పోస్టుపై స్పందించిన ఆయన.. హే పవన్ కల్యాణ్ అది కొత్తదేం కాదు.. ఐదేళ్ల క్రితం నాటి వీడియో. లక్షల సార్లు సర్య్యులేట్ అయ్యింది. ఆ వీడియో పెట్టమని నీకు సలహా ఇచ్చిన వెధవల్ని పక్కన పెట్టేయ్.. వాళ్లు రాజు రవితేజ కంటే చాలా ప్రమాదకరమని మరో ట్వీట్ లో గుస్సా అయ్యారు.
పవన్ పోస్ట్ చేసిన వీడియో పాతదన్న విషయం రవిప్రకాశ్ తో సహా అందరికి తెలుసని.. దానిపై రవి ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. నీ పక్కనున్న వారే అది ఎవరికి తెలీదని నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిని పక్కనపెట్టు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాజాగా పవన్ ట్వీట్లు చూస్తుంటే.. పవన్ వర్సెస్ వర్మ పోరు మరింత ముదిరేలా ఉందనటంలో సందేహం లేదు.