ఎన్టీఆర్ కథానాయకుడు - మహానాయకుడు ఆడియో - ట్రైలర్ రిలీజ్ కు కొద్దిసేపు ముందు.. వర్మ లక్ష్మీ'S ఎన్టీఆర్ అసలు కథ సినిమాలోని వెన్నుపోటు సాంగ్ రిలీజ్ చేశాడు. బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కీ, తను తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మధ్య తేడా ఏంటో చెప్తూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని వెన్నుపోటు పాట టీజర్ తో ఏపీ రాజకీయాల్లోని టీడీపీ శ్రేణులకు కోపం తెప్పించిన రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆర్జీవి దిష్టి బొమ్మలను తగుల బెట్టి నిరసన కూడా తెలిపాయి.
అయితే, దీనికి వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్టుగా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?" అంటూ ట్వీట్ చేసి చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేశాడు. కాగా, ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలకు టీడీపీ ఏం సమాధానం ఇస్తుందో తెలియాలి మరి.
ఇక వెన్నుపోటు సాంగ్ విషయాని కొస్తే - సిరాశ్రీ లిరిక్స్ రాయగా - కళ్యాణీ మాలిక్ మ్యూజిక్ అందించారు. పాట కూడా ఆయనే పాడాడు. రియల్ ఇన్సిడెంట్స్‌తో సినిమాలు తియ్యడంలో వర్మ స్పెషాలిటీ వేరు. పాటలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అయిన వాళ్ళ చేతిలో మోసపోయిన వ్యక్తి ఆవేదన సాగిపోయిన వెన్నుపోటు సాంగ్ - ఆర్జీవీ స్టైల్ లో అయితే ఏం లేదు. ఓ మోస్తరుగా ఉంది. ఇక సాంగ్ మొత్తం చంద్రబాబు - ఎన్టీఆర్ తో కలిసి ఉన్న విజువల్స్ తో పాటు - ఎన్టీఆర్ జీవితంలో కీలకమైన ఫోటోలను వాడారు.