జ్యోతిష్యుల్ని.. పండితుల్ని నమ్మకం రాజకీయ నాయకులకు మామూలే. అయితే.. మిగిలిన రాజకీయ నేతలకు జగన్ కు మధ్య వ్యత్యాసం అందరికి తెలిసిందే. ఆయన అభిమానం పొందటం.. నమ్మకం సాధించటం అంత చిన్న విషయం కాదు. ఒకవేళ నమ్మకం పొందినా.. అదెంత కాలమన్నది ఓ పెద్ద ప్రశ్న. జగన్ గురించి పరిచయం ఉన్న వారందరికి ఇది అనుభవమైన విషయం.
ఎప్పుడు తన పక్కన పెట్టుకుంటారు.. ఎప్పుడు పక్కన పెడతారో అర్థం కాక కిందామీదా పడిపోతుంటారు. అలాంటి జగన్ ఒక జ్యోతిష్యుడ్ని నమ్ముతారన్న పేరుంది. రాష్ట్ర విభజన జరుగుతుందని చెప్పటం మొదలు.. వైఎస్ మరణం దగ్గర నుంచి చాలానే విషయాలు ముందుగానే ఊహించి చెబుతారన్న ప్రచారం ఉన్న రమణరావు అనే జ్యోతిష్యుడు ఈ మధ్యన జగన్ ను కలిశారంట.
బెంగళూరు అడ్డాగా చేసుకొని అటు ఏపీ.. ఇటు కర్ణాటకలోని పలువురు రాజకీయ నేతలకు తన జ్యోతిష్య సేవల్ని అందించే రమణరావు.. జగన్ చేతిని సుదీర్ఘంగా పరిశీలించి.. లెక్కలు కట్టి చివరకు తేల్చిన విషయం ఏమిటంటే.. మూడేళ్లలో జగన్ సీఎం కానున్నారని తేల్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఈ నేపథ్యంలో జగన్ సీఎం కావటం ఖాయమని చెప్పేశారు. దీంతో.. జగన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ కావటమే కాదు.. మూడేళ్లలో తాను ముఖ్యమంత్రి అవుతానని జ్యోతిష్యులు కూడా చెబుతున్నరంటూ జగన్ నోటి నుంచి మాట రావటం చూస్తే.. రమణరావు ప్రభావం ఎంతుందో ఇట్టే చెప్పేయొచ్చు.
అలాంటి రమణరావు మరో వాదన కూడా చేస్తున్నారు. మూడేళ్లలో జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని చెబుతున్న ఆయన.. అప్పటికి చంద్రబాబు కాకుండా లోకేశ్ ను కానీ ముఖ్యమంత్రిని చేస్తే మాత్రం తెలుగుదేశమే అధికారంలోకి ఉంటుందని సెలవివ్వటం కాస్త చిత్రమైన అంశంగా చెప్పాలి. లోకేశ్ ను 2017 నాటికి ముఖ్యమంత్రిని చేయకపోతే అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతాయని సెలవిచ్చారు.
ఓ పక్క జగన్ సీఎం ఛాన్స్ ఉందని ఊరిస్తూనే.. లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పటం చూస్తే.. జగన్ నమ్మే జ్యోతిష్యుడు జగన్ సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పటాన్ని ఆయనెలా జీర్ణించుకుంటారో..?