టాటా స‌న్స్ కు ర‌తన్ గుడ్ బై?!

Update: 2016-12-16 13:15 GMT
అనూహ్య ప‌రిణామాల‌తో టాటా గ్రూప్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచింది. టాటా గ్రూప్  హోల్డింగ్ కంపెనీ అయిన టాటా ట్ర‌స్ట్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి ర‌త‌న్ టాటా త‌ప్పుకోనున్నారని పెద్ద ఎత్తున వార్త‌లు చెలామ‌ణిలోకి వ‌చ్చాయి. కొత్త చైర్మ‌న్ ఎంపిక ప్ర‌క్రియ‌పై స‌ల‌హా ఇవ్వాల్సిందిగా ఓ క‌న్స‌ల్టెంట్‌ ను టాటా ట్ర‌స్ట్స్ కోరిందని వార్త‌లు జోరుగా చెలామ‌ణి అయింది. అయితే ఇది అంతా వ‌ట్టిదేనని ర‌త‌న్ టాటా క్లారిటీ ఇచ్చారు.

ముందుగా వెలువ‌డిన వార్త‌ల ప్ర‌కారం...టాటా స‌న్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి సైర‌స్ మిస్త్రీని తొల‌గించిన త‌ర్వాత దానికి కూడా ర‌త‌న్ టాటా తాత్కాలిక చైర్మ‌న్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి చివ‌రిలోపు టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎంపిక ప్ర‌క్రియ‌ను ముగించాలని భావిస్తున్న నేప‌థ్యంలో.. టాటా ట్ర‌స్ట్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి కూడా ర‌త‌న్ టాటా త‌ప్పుకుంటార‌న్న వార్త రావ‌డం గ‌మ‌నార్హం. ర‌త‌న్ టాటా చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తప్పుకుంటే తాను కూడా ఇక ట్ర‌స్టీగా ఉండ‌బోన‌ని మేనేజింగ్ ట్ర‌స్టీ ఆర్ వెంక‌ట‌రామ‌నన్ అన్నారు. టాటా ట్ర‌స్ట్స్ కొత్త చైర్మ‌న్ బ‌య‌టి వ్య‌క్తి కూడా కావ‌చ్చ‌ని, ఎవ‌రైనా స‌మ‌ర్థ‌మైన వ్య‌క్తి ఉంటే ట్ర‌స్టీలు ప్ర‌తిపాదించ వ‌చ్చ‌ని క్రిష్ణ కుమార్ తెలిపారు. స‌మీప భ‌విష్య‌త్తులో కూడా టాటా ట్ర‌స్ట్స్‌ కు - టాటా స‌న్స్‌ కు వేర్వేరు చైర్మ‌న్లే ఉంటార‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. టాటాల చ‌రిత్ర‌లో టాటా ట్ర‌స్ట్స్‌ కు తొలిసారి పార్శీ కాని చైర్మ‌న్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు క్రిష్ణ కుమార్ చెప్పారు.

అయితే ఈ వార్త వైర‌ల్ కావ‌డంతో ర‌త‌న్ టాటా రంగంలోకి దిగారు. టాటా ట్ర‌స్ట్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తాను త‌ప్పుకోబోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ర‌త‌న్ టాటా ఖండించారు. ఈ మేర‌కు టాటా స‌న్స్  త‌ర‌ఫున ప్ర‌క‌ట‌న‌విడుద‌ల అయింది. టాటా ట్ర‌స్ట్స్ జాతిని ప్ర‌భావితం చేసే ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌ని, వాటిని ముందుకు తీసుకుపోవాల‌ని ర‌త‌న్ టాటా భావిస్తున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌నలో టాటా స‌న్స్ చెప్పింది. అయితే స‌రైన స‌మ‌యంలో నాయ‌క‌త్వ మార్పు ప్ర‌క్రియ చేపట్టాల‌ని టాటా అనుకుంటున్న‌ట్లు తెలిపింది. ర‌త‌న్ టాటా చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నార‌ని, కొత్త చైర్మ‌న్ ఎంపిక ప్ర‌క్రియ కోసం టాటా ట్ర‌స్ట్స్ ఓ క‌న్స‌ల్టెంట్‌ ను సంప్ర‌దించిన‌ట్లు ట్ర‌స్టీల్లో ఒక‌రైన ఆర్కే క్రిష్ణ కుమార్ చెప్పిన‌ట్లు మీడియాలో వార్త‌లు రావ‌డంలో నిజం లేద‌ని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News