జేఎన్ యూలో తాజాగా చోటు చేసుకున్న విపరీత పరిణామాలు తెలిసిందే. ఉగ్రవాది అఫ్జల్ గురు వర్థంతి సభను ఏర్పాటు చేయటం.. దీనిపై కేసులు నమోదై.. అరెస్ట్ కావటం.. దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కమ్యూనిస్ట్ నేతలు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిలవటం. . దీనిపై రాజకీయ కలకలం చోటు చేసుకోవటం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా పేరిట ఒకరు.. తమ సంస్థల్లో జేఎన్ యూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినట్లుగా కథనాలు వెలువడటం సంచలనంగా మారింది. దీనిపై పలువురు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మీద ప్రచారం జరుగుతున్న ట్వీట్ తో తమకు సంబంధం లేదని.. రతన్ టాటా ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదంటూ టాటా కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో విస్పష్టంగా పేర్కొంది.