‘రేవ్ పార్టీ’ సినిమా అలా మొదలైంది.. శివరాత్రి వేళ భక్తి ప్రోగ్రామ్ కలరింగ్.. సోషల్ మీడియాతో గాలం.
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గాంధీనగర్ తండా పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. ఆ పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ పార్టీ ఎలా మొదలైంది? ఎవరు మొదలు పెట్టారు? డ్రగ్స్ ఎలా వచ్చాయి? అనే వివరాలను తెలియజేశారు.
ఈ పార్టీ నిర్వహణ వెనుక ప్రధానంగా నలుగురు ఉన్నట్టు తెలిపారు. వీరికి మరో ముగ్గురు సహకరించినట్లు తేల్చారు. మొదటగా.. రేవ్ పార్టీలో పాల్గొనేందుకు యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నారట. ఇందుకోసం ‘పీఎస్ వై దమ్రూ’ అనే పేజీని క్రియేట్ చేసి, దాని ద్వారా ప్రచారం ముమ్మరం చేశారట.
అయితే.. ఈ పేజీ ద్వారా ‘మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్’ అనే ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేశారు. అది నిర్వహించింది శివరాత్రి రోజున కావడంతో.. చూసేవారికి ఇదేదో భక్తి కార్యక్రమంగా కలరింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పేజీ ద్వారా మొత్తం 90 మందిని ఆకర్షించి, వారిలో ఒక్కొక్కరి నుంచి రూ.499 ఎంట్రీ ఫీజుగా తీసుకున్నారట. ఆ తర్వాత మార్చి 11న గాంధీనగర్ తండాలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు.
పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గుట్టు రట్టు చేశారు. ఈ పార్టీలో 88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు ఉన్నట్టు తెలిపారు. వీరి నుంచి 400 గ్రాముల గంజాయి, ఐదు గ్రాముల డ్రగ్స్, 120 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా, అందరి ఫోన్లు, అక్కడికి వచ్చిన కార్లు, బైక్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ సూర్యపేటకు చెందిన వ్యక్తి ద్వారా వచ్చాయని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించారు.