స‌చిన్ పై రాష్ర్ట‌ మంత్రి అక్క‌సు

Update: 2015-08-11 07:04 GMT
మాజీ క్రికెటర్, విఖ్యాత దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగలో... ఆంధ్ర‌ప్రదేశ్ సంక్షేమ శాఖ మంత్రి  రావెల కిశోర్ బాబు స‌చిన్‌ పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. గ్రామ‌ సందర్శ‌నం కోసం వెళ్లిన మంత్రికి చుక్కెదురు కావ‌డంతో అక్క‌డే త‌న ఆవేశాన్ని మంత్రి బ‌య‌ట‌పెట్టుకున్నారు.

నెల్లూరు జిల్లా గూడూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కిశోర్‌ బాబు... సచిన్ దత్తత గ్రామం అయిన‌ పుట్టం రాజుకండ్రిగను పరిశీలించడానికి వెళ్లారు. ఆ గ్రామానికి వెళ్లగానే, తమకు ఇళ్ళు లేవంటు గ్రామస్తులు మంత్రి కారును అడ్డగించారు. కారు ముందు నిలబడి కదల్లేదు. ఆయనకు గ్రామస్తులు సమస్యల్ని ఏకరువు పెట్టారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ డిమాండ్ చేశారు.

ఈ క్ర‌మంలో మంత్రి రావెల త‌న అస‌హ‌నాన్ని స‌చిన్‌ పై ప్ర‌ద‌ర్శించారు. ద‌త్త‌త‌ గ్రామాన్ని  సచిన్ ఏం అభివృద్ది చేశారంటూ రావెల వ్యంగ్యంగా స్పందించారు. అయితే గ్రామస్తుల ఆందోళనతో.. గ్రామంలోని దళితవాడకు మంత్రి వెళ్లారు. తమకు కొత్త ఇళ్ళు కట్టిస్తామంటూ ఉన్న ఇళ్ళను కూడా తొలగించారని గ్రామ‌స్తులు వాపోయారు. గిరిజనుల గృహాలను పరిశీలించిన మంత్రి... 25 పక్కా గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

కొస‌మెరుపు: ఇప్పటికే గృహాలు మంజురైన వాటిని నిర్మించడంలో జాప్యం జరుగుతుండగా... మళ్ళీ గృహాలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడం  ఆసక్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News