‘వ్యాక్సిన్ వేసుకోండి.. ఆరోగ్యానికి మంచిది’ అన్న మాట మీద మొదట్లో కాసిన్ని అనుమానాలు ఉన్నా.. తర్వాత విరుచుకుపడిన సెకండ్ వేవ్ దెబ్బకు కరోనా టీకా వేసుకోవటానికి వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా వేసేసుకోవటం మన దేశంలో చూశాం. కానీ.. ప్రాశ్చాత్య దేశాల వారి తీరు అందుకు భిన్నంగా ఉంటుంది. టీకా వేసుకోవాలన్న మాటను వారు అస్సలు ఒప్పుకోరు. ఆ మాటకు వస్తే.. వ్యాక్సిన్ వేసుకోవాలా? వద్దా? అన్న స్వేచ్ఛ పౌరుడికి ఉంటుందని వాదిస్తారు. పశ్చిమ దేశాల్లోని ప్రజల వైఖరి కారణంగానే.. సెకండ్.. థర్డ్ వేవ్ లు అంత తీవ్రంగా ఉండటానికి కారణం.. అక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగకపోవటమే.
ఈ మధ్యనే వ్యాక్సిన్ వేసుకోకుండా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నికి వెళ్లి.. ఎయిర్ పోర్టులో పెద్ద ఇష్యూ అయిన టెన్నిస్ దిగ్గజం ఎపిసోడ్ గురించి తెలిసిందే. తాజాగా సదరు సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ టీకా మీద తనకున్న నిశ్చిత అభిప్రాయాన్ని బయటకు వెళ్లగక్కేశారు. టీకా వేసుకున్నట్లుగా పత్రాలు చూపించటం.. ఆ తర్వాత టీకా వేసుకోలేదనటం లాంటి వాదనలతో అతన్ని టోర్నీకి అనుమతిస్తారా? లేదా? అన్న సందేహాలు నడవటం.. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరగటం తెలిసిందే.
తాజాగా అతను బీబీసీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో టీకా వేసుకునే విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. టీకా వేసుకోవటం తప్పనిసరైనా సరే.. తాను మాత్రం వేసుకునేది లేదన్న ఆయన.. అందుకు ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం. గ్రాండ్ స్లామ్ టోర్నీలకు దూరమైనా సరే.. తాను మాత్రం టీకా వేసుకునేది లేదే లేదని తేల్చేశారు. ఎందుకిలా? ఇంత మొండితనం ఎందుకు? కోట్లాది మంది టీకాలు వేసుకున్నప్పుడు..వారెవరికీ లేని ఇబ్బంది జొకోవిచ్ కు ఏమిటి? అన్న ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు.
తన శరీరానికి ఏది అవసరమో.. కాదో అందరి కంటే తనకే బాగా తెలుసని.. టీకా మీద తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించే తాను టీకా తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన నిర్ణయం వల్ల కలిగే పర్యవసానాలు తనకు తెలుసని.. దీని కారణంగా తాను ఎన్నో టోర్నీలకు దూరం కావొచ్చని.. అయినా సరే.. ఆ నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్.. వింబుల్డెన్ గ్రాండ్ స్లామ్ తో సహా ఏ టోర్నీకి అనుమతించకపోయినా సరే.. ఫర్లేదని.. తన శరీరం కోసం తాను తీసుకునే నిర్ణయం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని తేల్చేశారు. ‘నా శరీరం కంటే నాకేది ఎక్కువ కాదు. నేను తీసుకునే నిర్ణయం కచ్ఛితమైనది. నాకు ఏ టైటిల్ ఎక్కువ కాదు. చాలామంది నేను వ్యాక్సినేషన్ కు వ్యతిరేకినని అనుకుంటున్నారు. ఇది కరెక్టు కాదు. టీకా వద్దనే హక్కు ఏ వ్యక్తికైనా ఉండాలి మాత్రమే చెబుతున్నా. టీకాకు వ్యతిరేకం కాదు’’ అని స్పష్టం చేశారు.
టీకా వేసుకునేందుకు ససేమిరా అంటూ ఉద్యమం చేసే వారికి అనుకూలంగా కానీ.. మద్దతు ఇచ్చేలా కానీ తాను మాట్లాడలేదంటున్నారు. ఇంతకూ.. జొకోవిచ్ వద్ద ఉన్న సమాచారం ఏమిటి? అన్ని విషయాలు షేర్ చేసుకున్న అతగాడు.. తన దగ్గరున్న సమాచారాన్ని కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా?