బాబు నాలుక మడత.. అందుకేనట..

Update: 2018-11-03 07:21 GMT
40ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన.. ఎందుకో అవసరార్థం నాలుక మడతేస్తున్నాడు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కానీ అసంబద్ధ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. కేంద్రంలో చక్రం తిప్పిన చాణక్యతతో ముందడుగేస్తున్నాడు.

చంద్రబాబు అపర చాణక్యత ఏంటో కానీ.. అంతుబట్టక టీడీపీ మంత్రులు - నాయకులు ఇప్పుడు తలగొక్కుంటున్నారట.. ఆయన మాటలు - చేతలు ఎవరికీ అంతుబట్టడం లేదట.. ఎప్పుడు ఎలా స్పందిస్తారో.. ఏం నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక  వాపోతున్నారట..

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు ఖండించకపోగా.. చౌకబారు ఆరోపణలు చేయడంపై టీడీపీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. ఈ తరహా ధోరణి రాజకీయ కుట్రలను ప్రేరేంపించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన నలుభై ఏళ్లుగా ఎన్నో సమావేశాలు - సభలు - కొన్ని వందల ప్రసంగాలు చూశామని.. మరి ఎందుకు పదే పదే తప్పుల తక్కెట్లో కాలు మోపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ దేశాన్ని తానే నిర్మించానని.. అలెగ్జాండర్ ను తానే ప్రెసిడెంట్ ను చేశానని వందలాది మంది ప్రజల సాక్షిగా నోరు జారిన బాబు ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయాడు. ఎందుకీ పరిస్థితి.. ఎందుకీ మార్పు.. ?

అంటే ఒకటే సమాధానం.. తన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని గుర్తించడం.. ప్రజా సంకల్పయాత్రలో జగన్ కు ప్రజాదరణ పెరగడం ఆయన గుర్తించారట.. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి ప్రజలను అబ్రకదబ్ర అంటూ అబద్దాలతో మాయ చేద్దామనుకుంటున్న మ్యాజిక్.. ఈసారి ఫలిస్తుందో లేదో చూడాలి మరి.. అయినా ముఖ్యమంత్రి బాబు గారి జిమ్మిక్కులను ముందే పసిగట్టిన ప్రజలు ఈసారి టీడీపీకి ఓటుతో సమాధానమిస్తామంటున్నారు. ఇదో లాజిక్..
Tags:    

Similar News