కాంగ్రెస్ ఎంపీ, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి కొత్త చర్చ మొదలైంది. చిరంజీవికి సన్నిహితుడు అయిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ సినీ జీవితంలో రికార్డ్ మూవీగా నిలిచిపోయే ఖైదీ నంబర్ 150కి గంటా ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్న వస్తోంది. సినీ ఈవెంట్లలో ముందుండే గంటా తనకు ఆప్తుడు అయిన చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంటే ఎందుకురాలేదనే ప్రశ్న ఇటు విశాఖ వర్గాలతో పాటు అటు చిరు అభిమానుల్లోనూ చర్చకు వస్తోంది.
మంత్రిగా ఉన్నందున ఏవైనా కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల గంటా హాజరు కాలేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదలయ్యే సమయంలో చిరు సినిమా వేడుకకు వెళితే వేరే సంకేతాలు పంపించినట్లు అవుతుందనే ఉద్దేశంతో గంటా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని పలువురు చెప్తున్నారు. లేదా రాజకీయ కోణంలోనే దూరంగా ఉన్నారేమోననే భావన సైతం వ్యక్తమవుతోంది. మొత్తంగా గంటా గైర్హాజరు మాత్రం చర్చనీయాంశంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/