సీఎం కేసీఆర్ కు భయం, భక్తితోపాటు కాస్త.. జాతకాల మీద కూడా నమ్మకం కూడా ఎక్కువే. అందుకే ఉమ్మడి ఏపీకి సెక్రెటేరియట్ గా సేవలందించిన సచివాలయానికి కేసీఆర్ పోవడం లేదు. అసలు ఆ భవనానికి వాస్తు లేదంటూ అడుగుపెట్టడం లేదు. బేగంపేటలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి కూడా వాస్తు లేదంటూ ఏకంగా ప్రగతి భవన్ ను ఆగమేఘాల మీద కట్టించేసి ప్రస్తుతం అక్కడే నివాసముంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రపాలన, రాజకీయ వ్యూహ కేంద్రం.. సర్వస్వం అన్నీ ప్రగతి భవన్ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. అధికారులు, నాయకులు అంతా ఇక్కడికే వచ్చి చర్చలు జరుపుతారు..కేసీఆర్ కు జాతకాలపై ఉన్న అభిమానం అలాంటిది.
మరి అంతలా జాతకాలను నమ్మే కేసీఆర్ ‘ముందస్తు ఎన్నికలపై’ మాత్రం ఎందుకు తొందరపడతున్నారన్నది అంతుబట్టని విషయం. కానీ దీనివెనుక జాతకం మహిమ ఉందంటున్నారు టీఆర్ఎస్ సన్నిహిత వర్గాలు.. అవును.. ఇప్పుడు కేసీఆర్ కు మహర్ధశ ఉందట.. కర్కాటక రాశిలో జన్మించిన ఆయనకు ప్రస్తుతం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయట.. సెప్టెంబర్ లోగానీ - అక్టోబర్ లో కానీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ కు తిరుగుండదని ఆ పండితుడి విశ్లేషణ..
అందుకే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే జాతకం తిరగబడే ప్రమాదముందని తెలిసే కేసీఆర్ ముందస్తుకు ఆలోచన చేస్తున్నట్టు పండితులు చెబుతున్నారు. కేసీఆర్ కు బలమైన జాతకాల పిచ్చే ఆయన ముందస్తు ఎన్నికలకు పురిగొల్పుతుందని అంటున్నారు. చిన్న చిన్న విషయాలనే సీరియస్ గా తీసుకునే ఆయన ఇలా రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగే పెద్ద విషయంలో జాతకాలను ఖచ్చితంగా నమ్ముతారంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ కు జాతకాలపై నమ్మకం ఫలిస్తుందా.. దెబ్బకొడుతుందా చూడాలి మరి..