ప్రధానమంత్రి నరేంద్రమోడీని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ దాదాపు గంటపాటు జరిగింది. ఈ సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన 11 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఒక్కో అంశాన్ని వివరిస్తూ దాన్ని పరిష్కరించాల్సిన అవసరాన్ని విడమర్చి చెప్తూ ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించేలా చొరవ చూపాలని కోరారు. తెలంగాణ స్థానిక యువతకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు ఏర్పాటుచేసుకున్న నూతన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలుపాలని, హైకోర్టును వెంటనే విభజించాలని విజ్ఙప్తి చేశారు. ఈ రెండూ జరుగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని ప్రధానికి స్పష్టం చేశారు. అయితే, కేసీఆర్ భేటీ వెనుక లాజిక్ కేవలం రాష్ట్ర సమస్యలు కాదని..దీని వెనుక భారీ రాజకీయ ఎజెండా ఉందని ప్రచారం జరుగుతోంది. అదే ముందస్తు ఎన్నికలు.
ఔను. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల పట్ల ఆసక్తిగా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది కాకుండా...డిసెంబర్ లోనే ఎన్నికలు జరగాలని గులాబీ దళపతి కోరుకుంటున్నారు. లేదంటే జనవరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని భావిస్తున్నారు. చంద్రశేఖర్ రావు అలా కోరుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఇప్పటికైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ ఎస్ లో జోష్ నింపుతున్నాయి. అక్టోబరులో రైతుబంధు రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని టీ-సర్కార్ భావిస్తోంది. అప్పటిలోగా బీసీ కులాల్లో కులవృత్తులపై ఆధారపడ్డ వారికి ఆర్థికసాయం చేయనున్నారు. అలాగే కళ్యాణలక్ష్మీ - షాదీముబారక్ - ఆసరా ఫించన్లతో పాటు మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ పథకాలు తమకు కలిసి వస్తాయని గులాబీ దళం అంచనా వేస్తోంది. అందుకే సర్కార్ సాయం పొందిన లబ్ధిదారులందర్ని తన ఓటుబ్యాంకుగా మార్చుకోవాలని టీఆర్ ఎస్ భావిస్తోంది.
మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే... ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారులు... తమను మరిచిపోయే ప్రమాదం ఉందన్న భయం టీఆర్ ఎస్ లీడర్లను వెంటాడుతోంది. దీంతోపాటుగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కేసీఆర్ దగ్గర ఫీడ్ బ్యాక్ ఉందని టాక్. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా... విపక్షాలన్నీ ఒక్క తాటిమీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వారంతా మేల్కొనక ముందే ఎన్నికలకు వెళ్తే మంచిదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అందుకే డిసెంబర్‌లోపు ఎన్నికలు ఉండాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారు.
దీంతోపాటుగా ముందస్తు ఎన్నికలకు వెళ్తామనే విషయాన్ని గతంలోనే మోడీ ముందు తెలంగాణ సీఎం ఉంచారనే ప్రచారం ఉంది. మోడీ నుంచి పూర్తిస్థాయిలో భరోసా వస్తే... తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు రానున్నాయి. ఈ విషయంలో ప్రధానితో కల్వకుంట్ల భేటీలో ఏం జరిగింది? కేసీఆర్ తను ఆశించిన హామీని పొందారా? అనే విషంయలో స్పష్టత రావాలంటే..మరికొన్ని రోజులు ఆగాల్సిందే.