ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రచార వ్యూహాల్ని సిద్ధం చేసేందుకు గడిచిన కొంతకాలంగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లటం గమనార్హం. ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా.. ఆ మాటకు వస్తే సమాచారం లేకుండానే ఆయన ఢిల్లీకి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. అయితే.. వ్యక్తిగత అంశాలతోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ తాజా ఢిల్లీ టూర్ పూర్తిగా ఆయన ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అని చెబుతున్నారు. గతంలో ఆయన ఢిల్లీలో కంటి.. దంతాలకు సంబంధించిన వైద్యం చేయించుకున్నారు. దీనికి సంబంధించిన పరీక్షల కోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా ఒక ప్రెస్ రిలీజ్ ను విడుదల చేసినట్లు చెబుతున్నారు.
నవంబరు నెల మొత్తం తీరిక లేని షెడ్యూల్ ఉండటం.. డిసెంబరు మధ్య వరకూ ఇలాంటి పరిస్థితే ఉండటంతో.. కీలకమైన ఎన్నికల ప్రచారం షురూ కావటానికి ముందే పరీక్షలు చేయించుకుంటే మంచిదన్న సూచనతో ఆయన ఢిల్లీకి వెళ్లినట్లుగా చెప్పారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట.. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ఎక్కడా.. ఎలాంటి సమావేశాల్లో పాల్గొనరని చెప్పినట్లుగా సమాచారం. ముందస్తు ఎన్నికలకు నెలల ముందు నుంచే పక్కా ప్లాన్ వేసిన కేసీఆర్.. దంత..కంటి పరీక్షల కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందా?