ఇటీవల వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో పలువురి దృష్టిని ఆకర్షించింది కుకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవరం కృష్ణారావు. ఎన్టీఆర్ మనమరాలు.. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని స్వయంగా బరిలోకి దిగటంతో మాధవరం పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు. తుది ఫలితం మీద పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది.
సుహాసిని రంగంలోకి దిగటంతో మాధవరం డీలా పడినప్పటికీ.. తుది వరకూ పోరాడాలని.. వెనక్కి తగ్గొద్దని కేసీఆర్ స్వయంగా మాధవరానికి చెప్పటం.. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో సంచలన విజయం నమోదైంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 35 రోజుల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్ ముహుర్తంగా డిసైడ్ చేయటం తెలిసిందే.
మరి.. ఇలాంటి వేళ.. ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయాలని తపిస్తున్న నేతలంతా అసెంబ్లీకి హాజరయ్యారు. వీరిలో ఐదుగురు సభ్యులు గైర్హాజరు అయ్యారు. ఐదుగురిలో నలుగురు సభకు రాకపోవటానికి కారణాలు వేర్వేరుగా ఉండగా.. మాధవరం రాకపోవటానికి కారణం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ప్రమాణస్వీకారం చేసే రోజు తగినట్లుగా లేకపోవటం..తనకు మంచి రోజు కాకపోవటంతో ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదని తెలుస్తోంది.
జాతకాలు.. ముహుర్తాలు.. నమ్మకాల విషయాల్లో సీఎం కేసీఆర్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా మాధవరం ఎపిసోడ్ ను చూస్తే.. నమ్మకాల విషయంలో కేసీఆర్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా కనిపించటం ఖాయం.
Full View