ఏపీలో ఎన్నికలు రాకనే రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు-జగన్-పవన్ ఎవరి దారిలో తమదైన ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, లక్ష్యాలు మాత్రం ఒక్కొక్కరివి ఒక్కోరకంగా ఉన్నాయి. జగన్ ను తీసుకుంటే ఎవరి అండ లేకుండా - ఎవరి మీద ఆధారపడకుండా పొత్తులకు పోకుండా అధికారంలోకి రావాలి - అనుకున్నది చేసి తీరాలి అన్న కోణంలో జగన్ ప్రజల్లో తిరుగుతున్నాడు. దేనిని లెక్కచేయడం లేదు. అలవికాని హామీల జోలికి పోవడం లేదు. దానికి కారణం ఒక్కటే... ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఒక్కసారి అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రజలు తననే కావాలనుకునేలా చేయాలనేది జగన్ పెట్టుకున్న లక్ష్యం. ఎవరు ఎన్ని అన్నా - తన దారిన తాను ముందుకు సాగుతున్నాడు.
ఇక చంద్రబాబు లక్ష్యం దీనికి విరుద్ధంగా ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలి. కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలి. కేసుల నుంచి బయటపడాలి. ఇదంతా జరగాలంటే జనం మనకు ఓట్లేయాలి... అని డిసైడ్ అయ్యారు. అందుకోసం జనాలు టెంప్ట్ అయ్యే హామీలు అమలు సాధ్యం కాకపోయినా ఇవ్వడానికి రెడీ అయ్యారు. గతంలోలాగే ఈసారి రుణమాఫీ వంటి భారీ పథకాలు ప్రకటించాలని ఆలోచిస్తున్నాడు.
తానే సీఎం అని భావించే పవన్ కళ్లు ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలు తెరిపించాయి. వాటిలో జనసేనకు షాకింగ్ ఫలితాలు కనిపించాయి. ఓట్లు గాని సీట్లు గాని 4-6 శాతానికి మించవని తేలడంతో పవన్ కళ్యాణ్ రెండు ప్రణాళికలు వేసుకున్నారట. అందుకే కొంతకాలం క్రితం వరకు పవన్ కళ్యాణ్ జగన్ ను ఒక్కమాట కూడా అనేవాడు కాదు. కానీ ఇటీవల పవన్ జగన్ పై ఒంటికాలి మీద లేస్తున్నాడు. పదేపదే ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకిలా అంటే... పవన్ వద్ద ప్లాన్ ఎ - ప్లాన్ బి ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.
ప్లాన్ ఎలో భాగంగా ఎలాగైనా వైసీపీతో పొత్తు పెట్టుకుని ఓ 30 సీట్లు అడగాలి... వైసీపీ బలం తోడుగా ఉంటే వాటిలో 20-25 సీట్లు అయినా గెలుచుకోవచ్చు అన్నది పవన్ ప్లాన్. ఆ ప్రయత్నాల వల్లే తెలుగుదేశాన్ని పదేపదే తిట్టే పవన్ జగన్ విషయంలో పెద్దగా స్పందించేవారు కాదు. అయితే, ఈ ప్రతిపాదనను వైసీపీ తోసిపుచ్చింది. దీంతో వేరే మార్గం లేక పవన్ ప్లాన్ బి అమలు చేస్తున్నాడని అంటున్నారు.
. అదేంటంటే... అధికార పార్టీతో పాటు - వైసీపీ మీద కూడా దాడి చేసి ఉతికి ఆరేస్తే తటస్థులు తన పట్ల ఆకర్షితులు అవుతారనేది అతని ఆలోచన. అంటే అచ్చం ప్రజారాజ్యం పార్టీ అవలంభించిన విధానం అన్నమాట. ఇలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జనసేన వైపు తిరుగుతాయని ఆలోచనట. తద్వారా కొన్ని సీట్లు గెలిచి తర్వాత.. చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రాన్ని గాడిని పెట్టగలరని నాకు అనిపిస్తోంది అంటూ ఎంచక్కా టీడీపీతో జట్టు కట్టొచ్చని పవన్ యోచిస్తున్నారట. పవన్ లో జగన్ పై సడెన్ మార్పునకు కారణం ఇదే అంటున్నారు.