అప్పుడూ.. ఇప్పుడూ ఎవరూ అడిగింది లేదు. కానీ.. సార్వత్రిక ఎన్నికల వేళ మోడీకి.. చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నిజానికి.. పవన్ ను చంద్రబాబు మద్దతు అడిగినట్లుగా వార్తలు వచ్చే సమయానికి తెర వెనుక మంతనాలు చాలానే మంతనాలు జరిగాయి. పవన్ ను మద్దతు అడగటానికి ముందు అందుకు పవన్ సిద్ధంగా ఉన్నారన్న స్పష్టమైన సంకేతం వచ్చాకే.. టీడీపీ అధినేత నోటి నుంచి మద్దతు మాట వచ్చిందని చెప్పక తప్పదు.
సార్వత్రిక ఎన్నికల వేళ బాబుకు తన మద్దతును ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాజాగా జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రం మద్దతు ఇవ్వలేదు.
ముందు ఎలా ఉన్నా.. ఎన్నికల సమయానికి తమకు మద్దతు ఇస్తానన్న మాట జనసేన అధినేత నోటి నుంచి వస్తుందని ఆశపడ్డ తెలుగు తమ్ముళ్లకు పవన్ తీవ్ర నిరాశకు గురి చేశారు. అదే సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండని పవన్.. నంద్యాల ఉప ఎన్నికల్లో తన తీరు తటస్థమన్న విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ ఎందుకిలా చేశారు? అన్నది పెద్ద ప్రశ్న.
దీనికి జవాబు వెతికే ప్రయత్నం చేస్తే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. ఏదైనా విషయం మీద స్పందిస్తానని చెప్పటం.. ఎంతవరకైనా వెళ్లటానికైనా సిద్ధమన్న మాటలు పవన్ నోటి వెంట తరచూ వస్తుంటాయి. అది ప్రత్యేక హోదా కావొచ్చు.. అక్వా పార్కు విషయంలో కావొచ్చు.. రాజధాని భూముల్ని రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించే విషయంలో కావొచ్చు. కానీ.. మాటలైతే వస్తాయి కానీ.. చేతల దగ్గరకు వచ్చేసరికే పవన్ మౌనంగా ఉంటారు. ఎందుకిలా? అన్న మాటను జనసేన వర్గాల్ని అడిగితే వారు వ్యూహాత్మకమని బదులిస్తారు.
ఇష్టం లేని విషయాల మీద స్పందించకుండా మౌనంగా ఉండే పవన్.. దాన్ని వ్యూహాత్మకమని ఎప్పటికప్పుడు తన మాటల్ని సమర్థించుకుంటారు. ఆ కోణంలో చూసినప్పుడు నంద్యాల ఉప ఎన్నిక విషయంలో పవన్ కు మద్దతు ఇవ్వటం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండొచ్చు. ఎప్పటి మాదిరి ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఉన్నా పవన్ ను ఎవరూ అడిగే పరిస్థితి ఉండదు. కానీ.. తన తీరుకు భిన్నంగా నంద్యాల ఉప ఎన్నిక మీద తన స్పందనను చెబుతానని చెప్పిన పవన్.. చెప్పినట్లే తన తీరును స్పష్టం చేయటం వెనుక వ్యూహం వేరేనని చెప్పక తప్పదు.
ఇప్పటివరకూ పవన్ హామీ ఇచ్చిన ఏ విషయంలోనూ.. చెప్పిన టైంకు అప్డేట్ ఇవ్వటం అలవాటు లేని పవన్.. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తన వైఖరి తటస్థం అన్న మాటను చెప్పటం ద్వారా.. చెప్పకనే తన సందేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారని చెప్పాలి.
ఇంతకీ పవన్ నర్మగర్భంగా చెప్పిన తటస్థం.. తనను అభిమానించే వారికి ఎలాంటి సందేశాన్ని ఇచ్చారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళలో.. పవర్ స్టార్ తన నియోజకవర్గానికి రావాలని.. ఆయన పవర్ ఫుల్ ప్రసంగం ఉండాలని కోరుతూ.. పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పవన్ మీద ఉండేవి. మీరు మాట్లాడకపోయినా ఫర్లేదు.. జస్ట్ సభకు వచ్చి చేతులు ఊపి వెళ్లిపోయినా.. పది నుంచి పాతిక వేల ఓట్లు పడతాయన్న మాట పలువురు అభ్యర్థుల నోటి నుంచి వినిపించేది.
అలా పవన్ ను బతిమిలాడిన తమ్ముళ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పవన్ వల్ల వచ్చింది మహా అయితే ఒకట్రెండు శాతం కంటే ఎక్కువ ఓట్లు కావని తేలిగ్గా తీసేయటం కనిపిస్తుంది. వాస్తవానికి పోటాపోటీ గా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు చెప్పినట్లు ఒకట్రెండు శాతం ఓట్లు మాత్రమే తగ్గినా.. అంతిమ ఫలితం దారుణంగా ఉండేదన్నది వాస్తవం.
పవన్ వల్ల లాభం పొంది.. అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత తనను చిన్నబుచ్చేలా.. తన ప్రయత్నాన్ని.. తన కష్టాన్ని తక్కువ చేసేలా మాట్లాడటంపై పవన్ ఆగ్రహంగా ఉన్నారన్న వాదన ఉంది. అందుకే.. తన ఆగ్రహాన్ని సమయం చూసి మరీ ప్రదర్శించారన్నది కొందరి విశ్లేషణ. అదెలా అంటే.. అధికారపక్షానికి ప్రతిష్ఠాత్మకమైన నంద్యాల ఉప ఎన్నికల వేళ.. కామ్ గా ఉండాల్సిన పవన్ వ్యూహాత్మకంగా తటస్థం అన్న మాట చెప్పటం ద్వారా.. అధికార పక్షానికి.. విపక్షానికి మనం సమదూరం అన్న విషయాన్ని చెప్పేసినట్లే.
సార్వత్రిక ఎన్నికల్లో అధికారపక్షానికి ఓటు వేయాలన్న స్పష్టమైన సందేశంతో చూసినప్పుడు.. తాజా ఉప ఎన్నిక సందర్భంగా తటస్థంగా ఉండటం అంటే.. అధికారపక్షానికి ఓటు వేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని నర్మగర్భంగా చెప్పినట్లేనని చెప్పక తప్పదు. ఎందుకంటే.. నిజంగానే ఓటు వేయాలని చెప్పాలంటే ఆ విషయం నేరుగా చెప్పేసేవారు కదా. అలా చెప్పలేదంటే.. ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పటమనేనని చెప్పక తప్పదు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికారపక్షానికి కష్టం తప్పదని.. గెలుపు సాధ్యం కాదన్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ.. తటస్థం అని పవన్ నోటి నుంచి మాట రావటం అంటే.. ఆయన్ను అభిమానించే వర్గానికి ఓటు వేయనక్కర్లేదన్న సందేశాన్ని పవన్ ఇచ్చేసినట్లేనని చెబుతున్న వారు ఉన్నారు. ఈ మాటలు వింటున్న అధికారపక్ష నేతలకు చెమటలు పడుతున్నాయి. తనను చిన్నబుచ్చిన టీడీపీ నేతలకు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు నంద్యాల ఉప ఎన్నిక సరైన వేదికగా పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎన్నికల్లో ఓటమి అన్నది ఎదురైతే.. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీతో కలిసి పోటీ చేస్తే.. తమ వాటా కింద పెద్ద ఎత్తున సీట్లు కేటాయించమని డిమాండ్ చేసేందుకు వీలు ఉంటుంది. ఒకవేళ.. గెలిచి.. పది వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చినా నైతికంగా ఓడినట్లే. అప్పుడు కూడా పవన్ దే పైచేయి అవుతుంది. ఇన్ని కోణాల్లో చూసినప్పుడు పవన్ తటస్థం నిర్ణయం వెనుక లెక్కలన్నీ పక్కాగా వేసుకొనే తన నిర్ణయాన్ని అధికారికంగా చెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జగన్ ప్రచారంతో ఆగమాగం అవుతున్న టీడీపీకి.. పవన్ తటస్థం దిమ్మ తిరిగే షాక్ ను ఇచ్చిందన్న వాదన జోరుగా వినిపిస్తోందని చెప్పక తప్పదు.