ఐపీఎల్ ముగిసింది. 45 రోజుల సాగిన దేశీయ క్రికెట్ సంగ్రామంలో చివరకు ముంబై విజేతగా నిలిచింది. టోర్నమెంట్ లో అత్యధిక విజయాలు సాధించి నంబర్ 1 జట్టుగా నిలిచిన ముంబై.. అదే ఊపులో టైటిల్ కూడా ఎగరేసుకుపోవడం విశేషం. అయితే ఫైనల్ మ్యాచ్ లో మూడు కీలక క్యాచ్ లు వదిసినా చెన్నై బ్యాట్స్ మెన్ వాట్సాన్ సద్వినియోగం చేసుకోలేదు. అన్ని పొరపాట్లు చేసినా కూడా అదృష్టం ముంబై వైపే నెగ్గింది..
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం బీసీసీఐకి సెంటిమెంట్ గా మారింది. ఇక్కడ జరిగిన ప్రతీ ఫైనల్ ఉత్కంఠభరింతంగా ఊపిరి బిగబట్టేలా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఐపీఎల్ ఫైనల్ లో ఇదే ముంబై కూడా ఇదే ఉత్కంఠతో గెలిచింది. అందుకే ఇంత మంచి పిచ్ ఎక్కడా ఉండదనే ఈసారి కూడా ఫైనల్ ఆతిథ్యం హైదరాబాద్ కే ఇచ్చారు బీసీసీఐ పెద్దలు.
నిజానికి నిన్న మ్యాచ్ చూసిన వారందరికీ చెన్నై గెలుపు ఖాయం అనుకున్నారంతా.. ఓపెనర్ బరిలోకి దిగిన వాట్సాన్ ఓ వైపు వీరోచితంగా పోరాడుతున్నారు. ధోని వచ్చాక గెలుపు చెన్నైదే అనుకున్నారంతా.. కానీ ధోని అనుమానాస్పదంగా రనౌట్ కావడమే చెన్నైకి మ్యాచ్ నుంచి లాగేసింది. చివరి బంతికి రెండు పరుగులు తీస్తే చెన్నైవిజయం.. ఒక్క పరుగు తీసినా డ్రా అవుతుంది. ఇంతటి క్లిష్ట ఓటమి పరిస్థితుల్లో ముంబై బౌలర్ మలింగ అద్భుతమే చేశాడు. చెన్నై బ్యాట్స్ మెన్ ను అవుట్ చేసి ముంబైకి అద్వీతయమైన విజయాన్ని కట్టబెట్టాడు. గెలుస్తుందనుకున్న చెన్నైని ఓడించాడు.
నిజానికి ముంబై విజయానికి, చెన్నై ఓటమికి మధ్యనున్నది ఒక్కడే. అతడే మహేంద్ర సింగ్ ధోని. ధోని ఆడినప్పుడల్లా చెన్నై గెలిచింది. ఫైనల్ లో రనౌట్ కావడంతో చెన్నై ఓడిపోయింది.ధోని లేకుండా మ్యాచ్ లు గెలవలేని స్థితిలో చెన్నై ఉంది. ఆ జట్టుకు ధోనినే బలం.. బలహీనతగా మారాడు.. ధోని ఆడనిదే విజయాలు అందుకోవడం లేదు. ధోని విఫలమవ్వడమే ఫైనల్ లో చెన్నై ఓటమికి కారణంగా చెప్పవచ్చు.