టికెట్లు ఫైన‌ల్ చేస్తే కూట‌మిలో ర‌ణ‌మేన‌ట‌!

Update: 2018-10-22 05:17 GMT
కారు జోరు త‌గ్గిన‌ట్లు.. కూట‌మి హ‌వా న‌డుస్తున్న‌ట్లు క‌నిపిస్తున్న చిత్రం.. సిత్ర‌మేన‌ట‌. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ కారు అభ్య‌ర్థులు తేల‌గా.. కూట‌మి బ‌రిలో దిగేదెవ‌ర‌న్న దానిపై క్లారిటీ రాని ప‌రిస్థితి. కూట‌మితో ప‌వ‌ర్ ప‌క్కా అని భావిస్తున్న‌ప్ప‌టికీ.. అదెంత తేలిక కాద‌ని.. అందుకు అవ‌రోధాలు చాలానే ఉన్న‌ట్లుగా చెప్ప‌క తప్ప‌దు. ఇప్పుడు క‌నిపిస్తున్న‌దంతా తుఫాను ముందు ప్ర‌శాంత‌త‌గా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.

కూట‌మికి సంబంధించి సీట్ల లెక్క‌ల‌పై ఎంత‌కూ తెగ‌ని చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. మెజార్టీ స్థానాల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థులే బ‌రిలోకి దిగుతార‌ని కాంగ్రెస్ చెబుతుంటే.. అర‌కొర సీట్లు ఇచ్చేట‌ట్లు అయితే.. కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో ప్ర‌యోజ‌నం శూన్య‌మ‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. ఎవ‌రికి వారు సీట్లకు సంబంధించి ప‌ట్టు విడ‌ని ప‌రిస్థితి. సీపీఐకి రెండు.. మూడు స్థానాలు మాత్ర‌మే కేటాయిస్తాన‌ని కాంగ్రెస్ చెబుతుంటే.. ఒక‌వేళ అలా సీట్లు కేటాయించ‌టమంటే.. అది ఆత్మ‌హ‌త్యాసాదృశ్యంగా సీపీఐ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు.

నిజానికి ఈ ప‌రిస్థితి ఒక్క సీపీఐకి మాత్ర‌మే కాదు.. తెలంగాణ జ‌న‌స‌మితి.. టీడీపీ నేత‌లూ చెబుతున్నారు. కూట‌మితో ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌ని కాంగ్రెస్ భావిస్తూ.. చూస్తూ కూర్చోమ‌ని తెగేసి చెబుతున్నారు. పైకి క‌ట్టుగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ కూట‌మిలో లుక‌లుక‌లు ఒక రేంజ్లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడు క‌నిపిస్తున్న‌దంతా కూడా.. టైం కోసం వెయిట్ చేస్తున్న వారేన‌ని.. ఒక‌సారి టికెట్లు ఫైన‌ల్ అయితే.. రెబెల్స్ ర‌చ్చ మొద‌ల‌వుతుంద‌ని.. దాని దెబ్బ‌కు కూట‌మి ప‌క్షాలు ఉక్కిరిబిక్కిరి కావ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. 

టికెట్లు ఫైన‌ల్ అయ్యాక తిరుగుబాటు తుట్టె క‌దులుతుంద‌ని.. టికెట్లు రాని అభ్య‌ర్థులు రెబెల్స్ గా బ‌రిలోకి దిగేందుకు సైతం వెనుకాడ‌ర‌ని చెబుతున్నారు. పైకి అంతా ఫైన్ అన్న‌ట్లు క‌నిపించినా.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత త‌క్కువ‌లో త‌క్కువ 30 స్థానాల నుంచి కూట‌మికి భారీ దెబ్బ ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో రెబెల్స్ బెడ‌ద త‌ప్ప‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. 

టికెట్ల‌ను ఆశించే వారి సంఖ్య కాంగ్రెస్‌ లో భారీగా క‌నిపిస్తోంది. 119 నియోజ‌క‌వ‌ర్గాలకు సంబంధించి కూట‌మి లెక్క‌ల్ని తీసివేయ‌కుండానే వెయ్యి మంది ఆశావాహులు టికెట్ల‌ను ఆశిస్తున్నారు. ఇంత‌మందిలో టికెట్లు ద‌క్కేదెవ‌రు?  టికెట్ల కోసం అప్లై చేయాల్సిన ప్ర‌ముఖుల్ని ప‌క్క‌న పెడితే.. పోటీ ఎంత తీవ్రంగా ఉంద‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు.

తాజా ప‌రిణామాల‌తో కూట‌మి లెక్క తేల్చి.. అభ్య‌ర్థుల్ని ఖ‌రారు చేయ‌టంతోనే ప‌ని పూర్తి కాద‌ని.. అప్పుడే అస‌లు ప‌ని పూర్తి అవుతుంద‌ని చెబుతున్నారు.

అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన త‌ర్వాత‌.. టికెట్ల రాని అసంతృప్తుల‌ను ఎంత త్వ‌ర‌గా బుజ్జ‌గిస్తారు..?  ఎంత త‌క్కువ‌గా రెబెల్స్ బెడ‌ద ఉంటుంది? అన్న దానిపైనే కూట‌మి విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజా అంచ‌నాల ప్రకారం క‌నిష్ఠంగా 30.. గ‌రిష్ఠంగా 40 స్థానాల వ‌ర‌కూ రెబెల్స్ బెడ‌ద త‌ప్ప‌దంటున్నారు. మ‌రీ.. విప‌త్తు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారన్న‌దే మ‌హాకూట‌మి ముందు అతి పెద్ద స‌వాలుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News