భార్య కొడుతోందని చెట్టేక్కాడు.. నెల నుంచి అక్కడే.. ఈయన కష్టం పగోడికి రావదయ్యా?
వివాహ బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ ముఖ్యమే.. కానీ ఆధిపత్య ధోరణి మాత్రం ఇద్దరి మధ్య వివాదాలకు దారితీస్తోంది. ఇక తాము వేధిస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. ఘర్షణలకు దిగడం.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం నిత్యకృత్యంగా మారింది.
ఒకప్పుడు వివాహమైన తర్వాత భర్తలు వేధిస్తున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గృహ హింసకు గురవుతున్న మహిళల కోసం ప్రభుత్వం కూడా అనేక చట్టాలను తీసుకువచ్చింది. అత్తవారింట గృహ హింసకు గురయ్యే మహిళలకు రక్షణ కల్పించడానికి అనేక చర్యలను చేపట్టింది.
ఇదిలా ఉంటే భార్యను వేధిస్తున్న భర్తల కంటే ఇటీవల భర్తలను వేధిస్తున్న భార్యల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తమకు రక్షణ లేదని భార్యా బాధితులు వాపోతున్నారు.తమ భార్యలు తెగ వేధిస్తున్నారంటూ అనేక మంది పురుషులు ఇటీవల కాలంలో భార్య బాధితుల సంఘాలు పెట్టి మరీ బయటకు వస్తున్నారు.
పెళ్లాల టార్చర్ తట్టుకోలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నామని తెగ బాధపడుతున్నారు. అంతేకాదు భార్యల తీరుపై నిరసనలు, ఆందోళనలు తెలుపుతూ బాధితులంతా ఒకరికొకరు అండగా నిలబడి భార్యలపైన పోరాటానికి రెడీ అయ్యారు.
తాజాగా యూపీలోనికోపగంజ్ కు చెందిన రామ్ ప్రకాష్.. తన భార్య తరచూ కొడుతోందని వంద అడుగుల పామ్ చెట్టు ఎక్కాడు. ఏకంగా నెల రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు తాడు సహాయంతో నీళ్లు, ఆహారంపైకి పంపిస్తున్నారు.
ఇక మరోవైపు అతడు తమ ఇళ్లలో ఏం జరుగుతుందో తొంగి చూసేందుకే చెట్టుపైకి ఎక్కాడని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారొచ్చి ప్రయత్నించినా రామ్ ప్రకాష్ మాత్రం కిందకు దిగనంటూ చెట్టుపైనే ఉన్నాడు. పోలీసులకు సాధ్యం కాక ఈ భార్య బాధితుడిని వదిలేసి వెళ్లిపోయారు.
మరీ ఎంత బ్రహ్మ రాక్షసి అయితే అతడి పెళ్లాం ఇలా చేస్తుందని.. భార్య టార్చర్ తట్టుకోలేక ఆ భర్త చెట్టు ఎక్కడ ఎంత వింత అని తోటి మగ పుంగవులు వాపోతున్నారు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు దేవుడా అంటూ వాపోతున్నారు.