పెను ప్రమాదం తృటిలో తప్పింది. మనం జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటోడు జాగ్రత్తగా లేకున్నా మనకే నష్టమన్నది ఎంత నిజమో తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు.
అతి వేగంతో నియంత్రణ కోల్పోయిన ఇన్నోవా కారణంగా చోటు చేసుకున్న బీభత్సం అంతాఇంతా కాదని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. హద్దులు దాటిన స్పీడ్ తో వెళుతున్న ఇన్నోవా వెహికిల్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీ కొట్టింది.
దీంతో.. అదుపు తప్పిన ఇన్నోవా ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనాన్ని ఢీ కొట్టింది. అంతలోనే మరో మూడు వాహనాల్ని ఢీ కొట్టిన ఇన్నోవా దెబ్బకు ఒకరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. ఇన్నోవా ఢీ కొట్టిన పోలీస్ వాహనంలో ఎవరూ లేకపోవటం పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదం జరిగిన వెంటనే.. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెడ్డి సుబ్రమణ్యంకు ఏమీ కాలేదని.. కానీ తృటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పక తప్పదు.