మనోళ్లు చేసే కొనుగోళ్లు కొన్ని అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి కొనుగోలు ఒకటి చోటు చేసుకుంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో భారీ కొనుగోళ్లు జరిపేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు కిందామీదా పడుతున్న వేళ.. అలాంటివేమీ పట్టించుకోకుండా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె చేసిన కొనుగోలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ కుమార్తె రేణుక తల్వార్ భారీ కొనుగోలు జరిపారు. న్యూఢిల్లీలోని ఒక బంగళాను ఆమె రూ.435 కోట్లతో కొనుగోలు చేశారు. న్యూఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్ లోని 4925 చదరపు మీటర్లు ఉన్న స్థలంలో 1189 చదరపు మీటర్ల లో ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. ఆమె కొనుగోలు చేసిన మొత్తాన్ని చదరపు మీటర్ కింద లెక్క వేస్తే.. ఒక్కో చదరపు మీటర్ ను రూ.8.8 లక్షలు ఖర్చు చేసినట్లుగా చెప్పాలి.
ప్రముఖులు నివాసం ఉండే లటీన్స్ బంగ్లా జోన్ లో రేణుక కొనుగోలు చేసిన ఈ ప్రాంతంలో మూడు వేల ఎకరాల్లో వెయ్యి బంగ్లాలతో విస్తరించి ఉంటుంది. మంత్రులు.. కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ఇక్కడ ఎక్కువగా నివాసం ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రేణుకకు ఇప్పటికే రెండు విలాసవంతమైన భవంతులు ఉన్నాయని.. వాటి విలువ కూడా వందల కోట్ల రూపాయిల్లో ఉంటుందని చెబుతున్నారు. జుట్టున్న అమ్మ ఏ కొప్పు అయినా పెట్టుకుంటుందన్నట్లే.. డబ్బులున్నోళ్లు కొనాలనుకోవాలే కానీ కొనలేనివి ఏముంటాయి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/