పన్నెండు గంటల బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి మళ్లీ చర్లపల్లి జైలుకు వెళ్లారు. కుమార్తె నిశ్చితార్థం కోసం షరతులతో కూడిన బెయిల్ ని పొందిన రేవంత్ గురువారం ఉదయం జైలు నుంచి ఇంటికి వచ్చారు.
అనంతరం కుమార్తె నిశ్చితార్థంలో హాజరైన ఆయన ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. అధికారుల కనుసన్నల్లో కోర్టు పేర్కొన్న పరిమితుల్ని ఏ మాత్రం అతిక్రమించకుండా జాగ్రత్తలు తీసుకున్న రేవంత్.. సన్నిహితులు.. సహచర నేతలతో కరచాలనం.. ఆత్మీయ హత్తుకోవటానికే పరిమితమయ్యారే తప్పించి.. ఎవరితోనూ మాట్లాడలేదు.
సాయంత్రం ఆరు గంటల వరకు తిరిగి వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. కోర్టు ఇచ్చిన సమయానికంటే గంట ముందే జైలుకు చేరుకున్నారు.ఆయన తిరిగి జైలుకు వెళుతున్న సమయంలో రేవంత్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు చెబుతున్నారు. అయితే.. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు.. తామంతా ఉన్నామని.. ఏ మాత్రం అధైర్యపడొద్దని సర్దిచెప్పినట్లు చెబుతున్నారు. రేవంత్ జైలుకు వెళ్లే సమయంలో ఆయన అభిమానులు పెద్దఎత్తున చేరుకొని ఆయనకు వీడ్కోలు పలికేందుకు పోటీ పడ్డారు.