మద్యం తాగి వాహనం నడపడానికే చట్టం ఒప్పుకోదని అలాంటిది తప్ప తాగి రాష్ట్రాన్ని నడిపే అధికారం కేసీఆర్ కు ఎవరు ఇచ్చారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాగి బండి నడిపేవారిని పట్టుకునే పోలీసులు తాగి రాఫ్రాన్ని నడపడాన్ని ఒప్పుకుంటారా? అని నిలదీశారు. తమ హక్కులు ప్రశ్నించినందుకు హోంగార్డులను నిర్ధాక్షిణ్యంగా అణచివేయాలని చూస్తున్న కేసీఆర్ పోలీసులకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. నిరసనకు దిగిన హోంగార్డుల అరెస్టు సమయంలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డులను రేవంత్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో గుమికూడిన హోంగార్డులు - ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ సర్కారుపై మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ధర్నాలు - బండ్లు - ఉద్యమాలు ఉండవని - పోలీసుల బూట్ల చప్పుడు - లాఠీఛార్టీలు కనిపించవని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రస్తుతం తన పదవిని కాపాడుకోవడం కోసం అమాయకులపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న హోంగార్డులను పోలీసుల కాళ్లతో తన్నించి - బూట్లతో తొక్కించి అమానుషంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఒక కాకి చనిపోతే వంద కాకులు దాని చుటూ గుమికూడి సానుభూతిని ప్రదర్శిస్తాయని అలాంటిది తమ తోటి ఖాకీ ఉద్యోగులైన హోంగార్డులు అన్యాయానికి గురవుతుంటే పోలీసు అధికారులు కనీసం సానుభూతిని కూడా చూపించకపోవడం దారుణమని రేవంత్ వాపోయారు. పోలీసు అధికారులనుద్దేశించి రేవంత్ మాట్లాడుతూ " ఇంటి నుంచి మీరు బయటకు కాలు పెట్టాలన్నా హోంగార్డు కావాలి. మీ ఇంట్లో వండేదెవరు? మీరు తిన్న ఎంగిలి కంచాలను కడిగేదెవరు? మీ బట్టలు ఉతికేదెవరు? మీ కారు తోలేదెవరు? తమ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా మీకు ఊడిగం చేస్తూ సేవలందిస్తున్న హోంగార్డుల బాధలను మీరు పట్టించుకోకపోవడం న్యాయమా? " అని ప్రశ్నించారు. హక్కుల కోసం పోరాడుతున్న మీ తోటివారిని కొట్టడానికి, బూట్లతో తన్నడానికి మీకు మనసెలా వచ్చిందని నిలదీశారు. మీకు అణిగిమణిగి ఉన్న ఈ హోంగార్డులు తిరగబడితే వారిని మీరు అడ్డుకోగలుగుతారా? కనీసం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను సమన్వయం చేసుకోగలరా?వాళ్లు వెంట లేకుండా మీరు కాలు బయటపెట్టగలుగుతారా? అని రేవంత్ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. హోంగార్డులకు కష్టమొస్తే వారిని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత డీజీపీకి లేదా? అని రేవంత్ దుయ్యబట్టారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తున్న హోంగార్డుల వద్దకు వచ్చి ఆంధ్రరాష్ట్రంలో మీ బతుకులు చితికిపోయాయని - ఉపాధి హామీ కూలీలకంటే తక్కువ జీతాలు వస్తున్నాయని, మున్సిపాలిటీలో చెత్త ఎత్తేసే కార్మికుల కంటే మీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మొసలి కన్నీళ్లు కార్చారని, తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులను దినసరి ఉద్యోగుల నుంచి పర్మినెంట్ ఉద్యోగులుగా మారుస్తామని హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం హోంగార్డులు అడుగుతున్నది కూడా కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్నేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది హోంగార్డులు ఉండగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఐదారువేల మంది హోంగార్డులు సేవలను అందిస్తున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా హోంగార్డులు అనితరమైన సేవలను అందించారని పేర్కొన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తాను ఇచ్చిన మాట మరచిపోయి హోంగార్డులను అణచివేయాలని ప్రత్నించడం సమంజసం కాదన్నారు. “నువ్వు సీఎం కావాలి. నీ కూతురు ఎంపీ కావాలి. నీ కొడుకు - నీ అల్లుడు మంత్రులు కావాలని నువ్వు కోరుకుంటే తప్పలేదు కానీ హోంగార్డులు తమ ఉద్యోగాలు పర్మినెంట్ కావాలని కోరుకుంటే మాత్రం తప్ప వచ్చిందా..? అని నిలదీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/