దూకుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మర్యాద తగ్గిపోవటమే కాదు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి ఇవ్వాల్సిన కనీసం గౌరవం ఇవ్వని పరిస్థితి. అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తితో రాజకీయంగా.. వ్యక్తిగతంగా సవాలచ్చ యవ్వారాలు ఉండొచ్చు. అంతమాత్రాన ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు కదా. వ్యక్తి మీదున్న కోపం.. సదరు వ్యక్తి ఉన్న గౌరవప్రదమైన స్థానానికి ఇవ్వకుండా పోవటం ఏమిటి?
రాజకీయంగా రేవంత్‌కు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య చాలానే ఉండొచ్చు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు రేవంత్ ఇవ్వాల్సిన మర్యాద.. గౌరవం ఇవ్వాల్సిందే.
ప్రభుత్వం ఆయన పట్ల ఏదైనా తప్పుగా వ్యవహరించినా..నిర్లక్ష్యం ప్రదర్శించినా.. దాన్ని న్యాయబద్ధంగా నిలదీయాలే తప్ప ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు. కానీ.. అలాంటి విషయాల్ని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది.
ఓటుకు నోటు ఉదంతంలో కోర్టు సూచన మేరకు కొడంగల్‌కు మాత్రమే పరిమితమైన రేవంత్.. ముఖ్యమంత్రి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం మాత్రం ఆపటం లేదు. తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తన నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష చూపిస్తే.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొక్కా పట్టుకొని నిలదీస్తానని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష ప్రదర్శించారా? లేదా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ అలా వ్యవహరిస్తే.. ఆ విషయాన్ని ప్రస్తావించి.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తీరు అలా ఉండకూడదని చెప్పాలే తప్పించి.. నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏమాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఎం స్థాయి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబుగా ఉండకపోగా.. విద్వేషాల్ని మరింత రెచ్చగొట్టేదిగా ఉంటుంది. దూకుడుగా ఉండటం మంచిదే.. అలా అని హద్దుల్లేని దూకుడుతనం ప్రజలకు సైతం వెగటు పుట్టిస్తుందన్న విషయాన్ని రేవంత్ మర్చిపోకూడదు.