కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో బెయిల్ కోసం ప్రయత్నాలు ఏమీ చేయకుండానే బుద్ధిగా చర్లపల్లి జైలుకు పోలీసుల మధ్య కూర్చొని బయలుదేరారు. రేవంత్ కు జైలు కొత్త కాదు. అయితే.. ఓటుకు నోటు కేసు ఎపిసోడ్ లో అరెస్టు అయిన వెళ్లే క్రమంలో ఆయన ప్రదర్శించిన ఆవేశం.. తొడ కొట్టటం లాంటివి తాజాగా అరెస్టు అయి జైలుకు వెళుతున్న సందర్భంగా లేకపోవటం గమనార్హం.
ఆ మాటకు వస్తే.. ఓటుకు నోటు ఎపిసోడ్ లో అరెస్టు సందర్భంగా రేవంత్ ప్రదర్శించిన ఆగ్రహానికి.. ఈసారి ప్రదర్శించిన ఆత్మవిశ్వాసానికి ఏ మాత్రం పోలిక లేదని చెప్పక తప్పదు. తాజా అరెస్టు ఆయన కోరుకొన్నదిగా చెబుతున్న దాన్లో నిజమెంత? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం రేవంత్ అరెస్టు ఎపిసోడ్ మొత్తం పక్కా వ్యూహమన్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కు ఒక భారీ పాంహౌస్ ఉందన్నది రేవంత్ ఆరోపణ. ఇప్పటికీ రేవంత్ ఆందోళన చేసిన భారీ నిర్మాణం ప్రైవేటు ఆస్తిగా చెబుతున్నారే తప్పించి.. అదెవరిదన్న విషయంపై క్లారిటీ రాని పరిస్థితి. అయితే.. జీవో 111 (ఈ జీవో అమలు అయ్యే ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు) అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు. అలాంటి చోట విశాల ప్రాంగణంలో నిర్మాణం అంటే అది కచ్ఛితంగా ఎవరో పవర్ ఫుల్ వ్యక్తులదే అన్నది ఖాయం. దీనికి బలం చేకూరుస్తూ రేవంత్.. సదరు ఫాంహౌస్ మంత్రి కేటీఆర్ దిగా ఆరోపించటాన్ని మర్చిపోలేం.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ లో ఉన్న ఫామ్ హౌస్ ఎవరిది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారేలా చేయటంలో రేవంత్ కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. సదరు ఫాంహౌస్ కేటీఆర్ దని చెప్పినా.. టీఆర్ఎస్ వర్గాలు కానీ.. మరెవరూ కానీ అది కేటీఆర్ ది కాదని.. నిరూపిస్తే.. అలా చేస్తాం.. ఇలా చేస్తామన్న సవాళ్లు విసరకుండా కామ్ గా ఉండటం గమనార్హం. ఇక.. రేవంత్ అరెస్టును చూస్తే కూడా వ్యూహాత్మకంగా అనిపించక మానదు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చిన ఆయన.. నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారే తప్పించి.. ఆయన్ను ఎయిర్ పోర్టు లో ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నది తప్పుడు ప్రచారంగా చెప్పాలి.
పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన.. పోలీసులతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. ఇదంతా చూసినప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది అరెస్టు కావటానికే అన్న అభిప్రాయం కలుగక మానదు. ఇక.. రేవంత్ మీద మోపిన నేరారోపణలు బెయిల్ రానంత తీవ్రమైనవి కాదు. ఎంపీగా ఆయన తలుచుకుంటే జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ ఆయన జైలుకు వెళ్లేందుకే వీలుగా మానసికంగా సిద్ధమై ఉచ్చారంటే పక్కా ప్లానింగ్ తోనేనని చెప్పక తప్పదు.
ఒకవేళ.. రేవంత్ ఆరోపిస్తున్నట్లు గా సదరు ఫామ్ హౌస్ మంత్రి కేటీఆర్ దే అయితే.. ఆయన్ను అడ్డంగా బుక్ చేసేందుకు వీలుగా రేవంత్ జైలు ఎపిసోడ్ కు తెర తీసినట్లే. తాను జైలుకు వెళ్లటం ద్వారా.. ఎందుకు వెళ్లారు? ఏ కేసులో వెళ్లారు? అన్న ప్రశ్నలతో పాటు.. కీలకమైన అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్న వేళ.. ఈ అంశంపై చర్చకు వచ్చేలా ఆయన ప్రయత్నించారని చెప్పాలి. అదే జరిగితే.. తనపై వస్తున్న ఫాంహౌస్ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కేటీఆర్ డిఫెన్స్ లో పడేలా ఫాంహౌస్ వ్యవహారం ఉందన్నది చెప్పక తప్పదు. మొత్తంగా ఫాంహౌస్ ఎపిసోడ్ లో కేటీఆర్ ను ఫిక్స్ చేసేందుకే పక్కా ప్లాన్ తో రేవంత్ అరెస్టు అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.