ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉంటూ.. కొంతకాలం చర్లపల్లి జైల్లో ఉండి వచ్చి.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో ప్రస్తుతం తాను నేతృత్వం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న విషయం విదితమే.
తాజాగా కొడంగల్ కు ఉప ఎన్నిక జరగనుందన్న వార్తలు జోరు కావటంపై ఆయన స్పందించారు. తాను రాజీనామా చేయటం లేదన్న విషయాన్ని విస్పష్టంగా వెల్లడించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. ఆ అవసరం లేదన్నారు.
దేశంలోని ఎంపీలు.. ఎమ్మెల్యేల్లో 200 మంది వరకు వివిధ కేసుల్లో ఉన్నారని.. ఎవరూ తమ పదవులకు రాజీనామా చేయలేదని.. ఎవరికి వర్తించని చట్టం తనకే ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్న ఆయన.. కొడంగల్ కు ఉప ఎన్నిక వస్తుందన్నది కేవలం విష ప్రచారమే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా తాను స్పందించనన్న విషయాన్ని రేవంత్ చెప్పకనే చెప్పేసినట్లుగా కనిపిస్తోంది.