తెలంగాణ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి గళం విప్పారు. తన పదునైన మాటలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఆయన.. తాజాగా మరోసారి చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు సంధించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా వరంగల్ లో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ చేపట్టిన చంఢీయాగం వెనుక ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
చావు నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ చంఢీయాగాన్ని తలపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. మరిన్ని అంశాలపై ఘాటుగా గళం విప్పారు. కేసీఆర్ హయాంలో దళితులకు భారీగా అన్యాయం జరిగిందని.. దళితుడైనందుకే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి తప్పించారని.. రాజయ్యను పదవి నుంచి తప్పించి కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు.
దళితులకు కేసీఆర్ చేసిన మోసానికి వరంగల్ ఉప ఎన్నికల్లో బదులు తీర్చుకోవాలన్నారు. మంత్రులు కమ్ కొడుకు.. మేనల్లుడైన కేటీఆర్.. హరీశ్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటీఆర్.. హరీశ్ రావుల కారణంగా ముప్పు పొంచిఉందని.. సొంత వారి నుంచి ఉన్న ముప్పు కారణంగానే వరంగల్ లో మూడు రోజులు ఉన్నారంటూ రేవంత్ వ్యాఖ్యనించారు.
కేసీఆర్ కారణంగా కేంద్రం నుంచి నిధులు రావని.. ఎన్డీయే అభ్యర్థిని గెలిపించటం ద్వారా.. వరంగల్ నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని.. ఎన్డీయే అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ పలుమార్లు ఓటర్లను అభ్యర్థించారు. మరి.. ఇంత భారీగా.. తీవ్ర ఆరపణలు చేసిన రేవంత్ మాటలకు వరంగల్ ఓటర్లు.. ఉప ఎన్నికల్లో ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి. ఏమైనా వ్యక్తిగత ఆరోపణల విషయంలో రేవంత్ కాస్తంత ఆచితూచి మాట్లాడితే బాగుంటుందేమో.