ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయసింహా, సెబాస్టియన్ కూడా కోర్టుకు వచ్చారు. ఏసీబీ చార్జిషీటు పరిగణలోకి తీసుకున్నాక తాము సమన్లు పంపిస్తామని న్యాయస్థానం వీరికి తెలిపింది. అనంతరం రేవంత్ విలేకర్ల తో మాట్లాడుతూ తాను జీవితాంతం టీడీపీలోనే ఉంటానని..అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పారు.
కేసీఆర్ తో పాటు తెరాస ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అవకతవకలపై తన పోరాటం మాత్రం ఆగేది లేదని చెప్పారు. శాసనసభ కార్యదర్శి సదానందం కొనసాగింపు నిబంధనలకు విరుద్దంగా ఉందని... ఆయన తెరాస కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్ గద్దె దిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
మరో 25 సంవత్సరాల పాటు తాను కొడంగల్ నుంచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తెరాస ప్రభుత్వ తీరును ఎండగడతానని కూడా కేసీఆర్ కు హెచ్చరికలు పంపారు. ఓటుకు నోటు కేసులో హాజరైన ఈయనకు కోర్టు ఒక మినహాయింపు ఇచ్చింది.మళ్లీ సమన్లు ఇచ్చే వరకు కోర్టుకు రానవసరం లేదని తెలిపింది.