తెలంగాణలో.. రెవెన్యూ ఎంప్లాయిస్ కూడా స్ట్రైక్ లోకి?

Update: 2019-10-14 07:34 GMT
ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ  ప్రజానీకం చాలా ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో బాగా జరుపుకునే పండగ అయిన దసరా సమయంలో ఆర్టీసీ కార్మికులు  సమ్మె బాట పట్టారు. హైదరాబాద్ నుంచి, పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రజానీకం  చాలా ఇబ్బందులు పడింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం అవుతూ ఉంది.

అయితే పోరాటాలు - ఉద్యమాలు - సమ్మెలు తెలంగాణకు కొత్త కాదు. ఆ సంగతలా ఉంటే.. తెలంగాణలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న ఇతర ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా సకల జనుల సమ్మె సాగబోతోందని  వార్తలు వస్తున్నాయి.

అదే జరిగితే ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడుతుంది.  ఇప్పటికే బస్సులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సకల జనుల సమ్మె అంటే అంతే సంగతులు. ఆ విషయం అలా ఉంటే.. ప్రభుత్వ తీరుపై నిరసన భావంతో రెవెన్యూ ఎంప్లాయిస్ కూడా ఇదే ఊపులో సమ్మెకు వెళ్లబోతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.

ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులకూ - కేసీఆర్ కు అస్సలు పడటం లేదు. ఈ రచ్చ చాన్నాళ్ల నుంచినే ఉంది. ఆ వ్యవస్థనే ప్రక్షాళన చేసే ఉద్దేశం ఉందట కేసీఆర్. ఇలాంటి పరిణామాల్లో ఆ ఉద్యోగ సంఘాల వాళ్లు సమ్మెకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా సమాచారం. మరి వారు కూడా వీధికి ఎక్కడి ప్రభుత్వంపై ఇదే ఊపులో మరింత ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News