పేలిన ట్విట‌ర్ గ‌న్! మంత్రితో ఏం తేడా వ‌చ్చింది ఆర్జీవీ?

Update: 2022-01-12 05:34 GMT
ఏపీ మంత్రి పేర్ని నానీతో సంచ‌ల‌నాల‌ దర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఏపీ స‌చివాల‌యంలో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. టిక్కెట్ రేటు పారితోషికాల‌ విష‌యంలో ఇరువురి మ‌ధ్య ప్ర‌ధానంగా చ‌ర్చ సాగింది. అయితే మంత్రిగారితో స‌మావేశంపై సంతృప్తిగా ఉన్నాన‌ని..తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పిన‌ట్లు  మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. అయితే అస‌లు ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి అంశాలు చ‌ర్చ‌కొచ్చాయి? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ భేటి అనంత‌రం వ‌ర్మ వ‌రుస ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి.

ఆర్జీవీ కాస్త సీరియ‌స్ గానే గంట‌లో ఏకంగా 25 ట్వీట్లు చేసారు. వ‌ర్మ చేసిన తాజా ట్వీట్ల‌కు-మంత్రితో భేటీ అనంత‌రం వ‌ర్మ మీడియాకి  చెప్పిన మాట‌లు స‌రిపోల్చితే ఎక్క‌డా పొంత‌న కుద‌ర‌లేదు. నేరుగా మంత్రితో అస‌లు విష‌యాలు చెప్ప‌కుండా దాచిపెట్టి బ‌య‌ట‌కు వ‌చ్చి వ‌ర్మ ప్ర‌భుత్వంపై ఎటాక్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ ఎదుర‌వుతోంది. ఓ సారి ఆట్వీట్ల‌ను ప‌రిశిలిస్తే విష‌యం అర్ధ‌మ‌వుతుంది.

``సినిమా టిక్కెట్ల‌కు విధించిన‌ట్లే మ‌రేదైనా ప్రోడక్ట్   పై ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు విధించిందా? ఒక వేళ అలా చేస్తే ఆ పూర్తి వివ‌రాలు చెప్పిండి. 500 కోట్ల‌తో తీసిన `ఆర్ ఆర్ ఆర్`  కోటి రూపాయ‌ల తీసిన‌  సినిమాతో  ఎలా పోల్చుతారు?  అలాంటప్పుడు టిక్కెట్ ధ‌రల మ‌ధ్య వ్య‌త్యాసం ఉండ‌కూడ‌దా?  కాంపిటీష‌న్ ఆధారంగా వ‌స్తువుల నాణ్య‌త‌..ధ‌ర నిర్ణ‌యిస్తారు. బ‌య‌ట శ‌క్తులు ఆధారంగా కంపెనీలు ధ‌ర‌లు నిర్ణ‌యించ‌వు . సినిమా నిర్మాణ వ్య‌యంతో  త‌మ‌కు సంబంధం లేద‌ని ప్ర‌భుత్వం బ‌ల‌వంతం చేస్తే ఆ ఉత్ప‌త్తే ఆగిపోవ‌చ్చు. అప్పుడు నాణ్య‌త‌లేని ఉత్ప‌త్తులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. మ‌హ‌రాష్ట్ర‌లో `ఆర్ ఆర్ ఆర్` టిక్కెట్ 2200 కి విక్ర‌యిస్తే సొంత రాష్ట్రంలో 200 రూపాయ‌ల‌కు అమ్మ‌డానికి వీలు లేకుండా చేసారు. ఇక్క‌డ ఆర్టిక‌ల్ 14 ఉల్లంఘ‌న జ‌రిగింది.

టిక్కెట్ ధ‌ర‌లు..స‌మ‌యం..ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ప్ర‌భుత్వం జోక్యం అవ‌స‌రం లేదు. ఇత‌ర వ‌స్తువుల‌పై లేన‌ప్పుడు సినిమా పైన ఈ రుద్దుడు దేనికి? ప‌గ‌లు రాత్రి తేడా లేకుండా సినిమాలు చేస్తే వ‌చ్చిన న‌ష్టం ఏంటి. మ‌హ‌రాష్ట్రంలో అలాంటి ఇబ్బందులు లేవు. వినియోగ‌దారుల వెసులుబాటుని బ‌ట్టి సినిమాలు వేసుకోకూడ‌దా? డ‌బ్బులు ఎక్కువ‌గా ఉండి ఎంత పెట్టి అయినా టిక్కెట్ కొంటాం అంటున్నారు. అలాంటప్పుడు ప్ర‌భుత్వానికి వ‌చ్చిన న‌ష్టం ఏంటి? ఇక్క‌డా స్వేచ్ఛ కు భంగం ఏర్ప‌డింది. అలా చేస్తే ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌స్తుంది క‌దా. నిర్మాత ఏ హీరోకి ఎంత ఇస్తే  ప్ర‌భుత్వానికి ఎందుకు?  అది వాళ్ల ఇష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

చైనా త‌ర్వ‌త ఎక్కువ జ‌నాభా గ‌ల దేశం మ‌న‌దే. కాబ‌ట్టి ఇక్క‌డి థియేట‌ర్ల‌ను పెంచాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. ఖాళీగా ఉన్న స్థ‌లాలు..గౌడౌన్లు.. గ్యారేజీల‌ను మినీ థియేట‌ర్ల‌గా మార్చి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌చ్చు. 70 ఏళ్లుగా ఉన్న సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టాన్ని 1955లో ఏపీ ప్ర‌భుత్వం తీసిపారేసింది. దీనిపై కోర్టులో స‌వాల్ విస‌రాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో  డిజాస్ట‌ర్ మేనేజ్  మెంట్ యాక్ట్ అమ‌లు క‌రెక్టే. కానీ సినిమాటోగ్ర‌ఫీ యాక్ట్ ని అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఏం ఉంటుంది. ఎక్కువ ధ‌ర పెట్టి  సినిమా టిక్కెట్  కొన‌లేని వారికి ప్ర‌భుత్వ‌మే సంక్షేమ ప‌థ‌కం కింద‌ రాయితీ క‌ల్పించి విక్ర‌యించవ‌చ్చు క‌దా.

టిక్కెట్ రేట్లు..థియేట‌ర్ షోల గురించి వ‌దిలేసి..భ‌ద్ర‌త‌..ప‌న్నుల‌పై ప్ర‌భుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. చివ‌రిగా చెప్పేది ఒక‌టే. ప్ర‌భుత్వం..మంత్రి పేర్ని నాని ..ఆయ‌న టీమ్ తో నా స‌హ‌చ‌రులు ఒక‌రిపై ఒక‌రు బుర‌ద చ‌ల్లుకోకుండా ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ జ‌రిపితే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌``న్నారు. మొత్తానికి వ‌ర్మ చేసిన ఈ ట్వీట్ల‌ను బ‌ట్టి మంత్రి నానితో భేటి ఎలా జ‌రిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. అక్క‌డ అంతా వ‌ర్మ అనుకున్న‌ట్లు గ‌నుక జరిగితే ఇలా ట్విట‌ర్ గ‌న్ నుంచి బుట్లెట్లు ఎందుకు పేల్తాయ్?

ఆర్జీవీ చెప్పిన కీల‌కు సూచ‌న‌లివి..

** సినిమా టికెట్లకు విధించినట్లే ఇంకేదైనా ప్రొడక్ట్ పై ప్రభుత్వం నిబంధనలు విధించిందా? ఒకవేళ విధించినట్లు అయితే ఆ ఉత్పత్తి పేరు అందుకు కారణాలు తెలపాలి.
** రూ.500 కోట్లతో తీసిన ఆర్‌.ఆర్‌.ఆర్ ను రూ.కోటి తీసిన చిత్రంతో ఎలా పోల్చుతాం. చిన్న చిత్రాలతో సమానంగా బారీ బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ ధరను ఎలా నిర్ణయిస్తారు.
** కాంపిటీషన్‌ ఆధారంగానే వస్తువుల నాణ్యత ధర నిర్ణయిస్తారు. బయట శక్తుల ఆధారంగా కంపెనీలు ధరలను నిర్ణయించవు.
** సినిమా నిర్మాణ వ్యయంతో తమకు సంబంధం లేదని సర్కారు వాదించాలనుకుంటే అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకేౖనా వర్తిస్తుందా?
** ఒక వస్తువును తక్కువ ధరకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేస్తే.. అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు క్వాలిటీ లేని ప్రొడక్ట్‌లు బయటకు వస్తాయి.
** మహరాష్ట్రాలో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టికెట్‌ను రూ.2,200కు విక్రయించేందుకు అనుమతిస్తే, తన సొంత రాష్ట్రంలో రూ.200లకు కూడా విక్రయించే అవకాశం లేదు. ఆర్టికల్‌ 14 ప్రకారం అది నిబంధనలను ఉల్లంఘించడం కాదా?
** సినిమా టికెట్‌ ధరలు, సమయం, ప్రదర్శన విషయంలో ప్రభుత్వం జోక్యం అవసరం లేదు. ఇతర వస్తువుల ధరల విషయంలో లేని జోక్యం టికెట్లపై ఎందుకు?
** రాత్రింబవళ్లు థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తే వచ్చే నష్టమేంటి? కొవిడ్‌ కన్నా ముందు మహారాష్ట్రలో 24/7 సినిమాలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఉన్నాయి.
** వినియోగదారులపని వేళలు, సమయానుకూలతను బట్టి సినిమా ప్రదర్శన చేయవచ్చు కదా?  వాళ్లకు ఉన్న వెసులుబాటును బట్టి అర్థరాత్రి సైతం సినిమా చూేసలా అవకాశం ఎందుకు ఇవ్వకూడదు?
** ప్రత్యేక షోలకు టికెట్‌ ధరలు అధికంగా ఉన్నా ప్రజలు కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాదా? పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది కదా?
** ఒక హీరోకి నిర్మాత ఎంత రెమ్యునరేషన్‌ ఇస్తున్నారనే విషయంలో సర్కారుకు ఉన్న సమస్య ఏంటి? పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర స్టార్‌ హీరోలకు ఎందుకంత పారితోషికం ఇస్తున్నారంటే, ఒక వేళ మనం ఐఫోన్‌ బద్దలు కొడితే అందులో వాడిన మెటీరియల్‌కు అయిన మొత్తాన్ని లెక్కకడితే రూ.1000 కూడా కాదు. కానీ రూ.2లక్షలు పెట్టి మనం ఆ ఫోన్‌ కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్‌ తయారు చేసిన ఆలోచనకు అంత చెల్లిస్తున్నాం. బ్రాండ్‌, మార్కెట్‌ అలా డిమాండ్‌ చేస్తుంది. అలాగే సినిమా కూడా అంతే!
** చైనా జనాభా మనకంటే ఎక్కువ. అమెరికా జనాభా మనకన్నా తక్కువ. కానీ ఆ రెండు ప్రాంతాల్లోనూ మన కన్నా పదిరెట్లు ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ప్రదర్శన విషయంలో మనం ఆ సంఖ్యను చేరుకునేలా ప్రభుతాలు కృషి చేయాలి.
** ఖాళీగా ఉన్న స్థలాలు,.. గౌడౌన్లు, .. గ్యారేజీలను మినీ థియేటర్లుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే బావుంటుంది.
** 70 ఏళ్లుగా అమలు చేస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం 1955ను ఏపీ ప్రభుత్వం తీసి పారేసింది. దీనిపై కోర్టులో సవాల్‌ విసరాలి.
** ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ అమలు చేయడం సబబే. కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌ను అమలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది?
** ఒకవేళ ప్రజలపై సర్కారుకు ప్రేమ.. మమకారం ఉంటే.. ఎవరైతే సినిమా టికెట్‌ను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయలేరో వారికి సంక్షేమ పథకం కింద ప్రభుత్వమే రాయితీ కల్పించి విక్రయించవచ్చు కదా!
** టికెట్‌ రేట్లు.. థియేటర్‌లో షోలు గురించి వదిలేసి భద్రత‌.. పన్నులపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది.
** చివరిగా నేను కోరేది ఒకటే... ప్రభుత్వం.. మంత్రి పేర్ని నాని.. ఆయన టీమ్‌తో నా సహచరులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోకుండా ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
Tags:    

Similar News