రక్తస్రావంతో రిషబ్ పంత్.. వీడియో వైరల్..!

Update: 2022-12-31 05:53 GMT
టీం ఇండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ నిన్న ఉదయం కారు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న క్రమంలో ఢిల్లీ డెహ్రడూన్ జాతీయ రహదారిపై పంత్ డ్రైవ్ చేస్తున్న మెర్సిడెస్ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ ఘటనలో కారు నుంచి మంటలు రావడంతో రిషత్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి.

అటుగా వెళుతున్న ఓ బస్సు డ్రైవర్.. అందులోని ప్రయాణికులు కారు ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే అక్కడి చేరుకొని పంత్ ను బయటకు తీసుకు రావడంతో ప్రాణాపాయం నుంచి రిషబ్ బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో రిషబ్ నుదిపై చిట్లిన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని స్థానికులు డెహ్రడూన్ ఆస్పత్రికి తరలించారు.

రిషబ్ కు యాక్సిడెంట్ జరిగేందనే వార్త బయటకు రావడంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈక్రమంలోనే అతడి ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఆరా తీసింది. కారు ప్రమాదంలో రిషబ్ పంత్ కు నుదురు చిట్లిందని.. వీపుపై కాలిన గాయాలు.. కుడి కాలిపై లిగ్మెంట్ పక్కకు జరిగినట్లు ఎక్స్ రేలో వెల్లడైందని పేర్కొంది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.

కాగా పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రిషబ్ పంత్ కారు వేగంగా డివైడర్ ను ఢీకొట్టిన సంఘటనతో పాటు పంత్ తీవ్ర రక్తస్రావం కావడంతో.. కారులో మంటలు రావడంతో అతడి ఒంటిపై స్థానికులు దుప్పటి కప్పి ఆస్పత్రికి తరలించేందుకు యత్నించడం వంటి వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరోవైపు గతంలో రిషబ్ పంత్.. శిఖర్ ధావన్ మధ్య డ్రైవింగ్ విషయంలో జరిగిన చిన్నపాటి సంభాషణ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శిఖర్ ధావన్ పంత్ ను జాగ్రత్తగా డ్రైవ్ చేయమని సలహా ఇస్తున్నాడు. ఈ వీడియో 2019 నాటిది కాగా రిషబ్ పంత్ శిఖర్‌ దావన్ కి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా అని అడిగగా దీనికి పంత్ 'గాడి ఆరామ్ చాలయా కర్.' అంటూ చెప్పడం విశేషం.

ఇదిలా ఉంటే నటి ఊర్వశి రౌతేలా ఒక అందమైన ఫొటోను షేర్ చేస్తూ 'ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పంత్ త్వరగా కోలుకోవాలని ఈ పోస్టు పెట్టిందా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు గతంలో సోషల్ మీడియాలో పరోక్షంగా గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఊర్వశి రౌతేలా పోస్ట్ సైతం నెట్టింట్లో వైరల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Tags:    

Similar News