ప్ర‌పంచంలో శ‌క్తివంత‌మైన నేత ఇక‌లేరు...

Update: 2019-09-06 07:03 GMT
దక్షిణాఫ్రికా ఖండంలోని జింబాబ్వేకు సుధీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబే (95) కన్నుమూశారు. ఆఫ్రికాలోనే కాకుండా - ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయ‌న కొద్ది రోజులుగా తీవ్ర‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు జింబాబ్వే మీడియా వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి 1980కు ముందు బ్రిటన్ జింబాబ్వేను ఆక్రమించుకుని పాలన చేస్తూ వచ్చింది. ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ చాలా దేశాలను వలస దేశాలుగా వాడుకుంది.

ఈ క్రమంలోనే 1980కి ముందు ద‌క్షిణ‌ రొడీషియా పేరిట జింబాబ్వే బ్రిటన్‌ కు వలస దేశంగా ఉండేది. అప్పుడు ఉత్తర రొడీషియాగా ఇప్పుడు సుడాన్ దేశం ఉండేది. అప్పటి ప్రధాని అయాన్‌ స్మిత్ మైనార్టీ వ‌ర్గాల‌ను వ్య‌తిరేకిస్తూ చేసిన పాలనకు వ్యతిరేకంగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ముగాబే గెరిల్లా పోరాటం చేశారు. 1960లో ప్రారంభమైన ఈ గెరిల్లా పోరాటం 1980వ ద‌శాబ్దం వరకు కొనసాగింది. స్వాతంత్య్రం వ‌చ్చాక కొన్నాళ్ల పాటు ఆయ‌న‌ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1987 నుంచి 2017 వరకు 30 సంవత్సరాలపాటు ఆయన అధ్యక్ష హోదాలో కొనసాగారు.

ముగాబే మూడు దశాబ్ధాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్‌ లో సైనిక తిరుగుబాటు ద్వారా తెరపడింది. స్వాతంత్య్రానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో ముగాబే విజయం సాధించి 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆఫ్రికా న‌ల్ల సూర్యుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. జింబాబ్వే జాతిపితగా - స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ముగాబే పేరొందారు.



Tags:    

Similar News