అసలే ఫైర్ బ్రాండ్. తూటాల్లాంటి మాటలకు వ్యంగ్యం తోడైతే.. ఇంక చెప్పేదేముంది? ఏపీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఏపీ అధికారపక్షంపై ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందన్నారు. పథకం ప్రకారం కుట్ర పన్నుతున్నారని.. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేత ఛాంబర్ లో లీకేజీ వ్యవహారం నడిచిందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జగన్ పై కుట్రలు జరుగుతున్నాయన్న రోజా.. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా.. దాని వెనుక జగన్ ఉన్నట్లుగా టీడీపీ నేతలు చెప్పటం సాధారణంగా మారిందన్నారు. రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనమడు దేవాన్ష్ కానీ ఏడిస్తే.. దానికి కూడా జగన్ గిచ్చి ఉంటారని చెప్పినా ఆశ్చర్యపోనకర్లేదంటూ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ భవనం లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన రోజా.. వందల కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన భవనం.. కేవలం 20 నిమిషాల పాటు కురిసిన వర్షానికే రాష్ట్ర అసెంబ్లీ.. సచివాలయం జలదిగ్బంధంలోని చిక్కుకోవటం ఏమిటని ప్రశ్నించారు. లీకేజీపై రోజా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/