మణికొండ ఘటన కి భాద్యత నాదే ..ఫ్యామిలీకి రూ.10 లక్షల సాయం: కేటీఆర్
తెలంగాణ శాసన సభ సమావేశాలు చాలా రవవత్తరంగా కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ మరియు విపక్షల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ఇక తాజాగా శాసన మండలి వేదికగా మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం వలన ఈ మధ్యనే డ్రైనేజ్ హొల్ లో పడి రజినీకాంత్ చనిపోయారని , వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే రూ. 5 లక్షలు ఇచ్చామని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరినట్టు రజినీకాంత్ కుటుంబానికి మరో రూ 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్.
ఇక ఘటన కు బాధ్యులు అయిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్ లను సస్పెండ్ చేయడం జరిగిందని, ఈ ఘటన పై ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. 2 సెంటిమిటర్ ల వర్షం పడితేనే తట్టుకునే శక్తి మన వరద కాలువలకు లేదు. వరద కాలువల కొత్తగా నిర్మాణం చేపడుతామన్నారు. ఈ ఏడు ఏండ్ల లో కొంత అక్కడక్కడ నాలా లపై ఆక్రమణలు జరిగాయని తెలిపారు. తమ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే ఆ ఘటన జరిగిందన్నారు. ఇందుకు మంత్రిగా తాను బాధ్యత వహిస్తున్నానని.. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కుంభవృష్టి తట్టుకునేలా మున్ముందు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతుల ఆత్మహత్యలు తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణే అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించిందని, జూట్ మిల్ లు కామారెడ్డి, వరంగల్, సిరిసిల్ల లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటన చేశారు కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన సమయంలో దేశం జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ శాతం 4.06గా ఉండేందని తెలిపారు. గత ఏడు సంవత్సరాల వరుస పెరుగుదలతో దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగిందని వివరించారు. దేశం యొక్క ప్రగతి రేటు కంటే మన ప్రగతి రేటు ఎక్కువగా ఉందని హరీశ్ రావు వివరించారు. దేశ వృద్ధికి కూడా తెలంగాణ రాష్ట్రం తోడ్పాటును అందిస్తుంది. దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. ప్రాథమిక రంగంలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు నీతిఆయోగ్ చెప్పిందని తెలిపారు. సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నామని వివరించారు.