ప్ర‌తిభ‌కు ప‌ట్టం.. ఆ యువ‌తికి రూ.2 కోట్ల జీతం!

Update: 2021-05-16 14:30 GMT
టాలెంట్ మ‌న సొంత‌మైతే.. గెలుపు ఆటోమేటిగ్గా కాళ్ల ద‌గ్గరికి వ‌చ్చేస్తుంద‌ని చెప్ప‌డానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ దీప్తి. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన న‌ర్కుటి దీప్తి.. ప్ర‌తిష్టాత్మ‌క మైక్రోసాఫ్ట్ సంస్థ‌లో ఉద్యోగం సాధించారు. ఆమె టాలెంట్ ను మెచ్చిన సంస్థ నిర్వాహ‌కులు.. దీప్తిని అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ ప్ర‌ధాన కార్యాల‌యంలో జాబ్ ఆఫ‌ర్ చేశారు.

క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలోనే దీప్తి ఈ జాబ్ సొంతం చేసుకోవ‌డం విశేషం. దీప్తికి ఉద్యోగం ఇచ్చేందుకు ఎం.ఎస్ మాత్ర‌మే కాదు.. గోల్డ్ మెన్ సాక్స్‌, ఆమేజాన్ కంపెనీలు కూడా పోటీప‌డ్డాయి. అయితే.. దీప్తి మాత్రం మైక్రో సాఫ్ట్ సంస్థ‌నే సెల‌క్ట్ చేసుకుంది. ఎం.ఎస్ ప్ర‌తినిధులు సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్ మెంట్ ఇంజ‌నీర్ (ఎస్‌డీఈ) గ్రేడ్‌-2 కేట‌గిరీలో ఎంపిక చేసుకున్నారు. ఇందుకు గానూ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీని ప్ర‌క‌టించారు.

కాగా.. దీప్తి తండ్రి డాక్ట‌ర్ వెంక‌న్న‌ ఒక ఫోరెన్సిక్ నిపుణుడు. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ లోని క్లూస్ టీమ్స్ కు నేతృత్వం వ‌హిస్తున్నారు. కూతురిని అమెరికాలో ఎం.ఎస్ కంప్యూట‌ర్స్ చ‌దివించారు. మే 2వ తేదీతో ఆమె కోర్టు కంప్లీట్ అయ్యింది. అంత‌కు ముందే క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో జాబ్ కొట్టిన దీప్తి.. ఈ నెల 17న ఉద్యోగంలో చేర‌నుంది.
Tags:    

Similar News