215 కోట్ల కుంభకోణం కేసు.. అడ్డంగా బుక్కైన హీరోయిన్?

Update: 2022-09-03 11:09 GMT
రూ.215 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో  బాలీవుడ్ హీరోయిన్  నోరా ఫతేహి విచారణ ఎదుర్కొంటోంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరుడుగట్టిన నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్ కేసులో ఈమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఛార్జీ షీట్ దాఖలు కాగా.. మరో హీరోయిన్ ఇలా బుక్కవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అక్రమ ఆర్థిక లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మను ఢిల్లీ పోలీసులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారించారు. సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించి 200 కోట్ల బలవంతపు వసూళ్ల కుంభకోనంలో ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి చెందిన అధికారులు నోరా ఫతేహిని పలు రకాలుగా విచారించారు.

నోరా ఫతేహిని 50 ప్రశ్నల వరకూ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. ఆమెకు ఎలాంటి బహుమతులు వచ్చాయి? ఎవరితో మాట్లాడింది? వారిని ఎక్కడ కలిశారన్నది పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది.

ఇక తనకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో సంబంధాలు లేవని.. తాను సుకేష్ తో విడిగానే మాట్లాడినట్టు వెల్లడించింది. నెయిల్ ఆర్ట్ ఫంక్షన్ కోసం అతడి భార్య తనతో మాట్లాడిందని.. ఆపై తరచూ తనకు ఫోన్ చేసేదని ఆమె తెలిపారు. వారు ఆమెకు బీఎండబ్ల్యూ , ఇతర కార్లు బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. అతడి నేరనేపథ్యం తనకు తెలియదని నోరా ఫతేహి పోలీసులకు తెలిపింది. సుకేష్ తన మేనేజర్, కజిన్ తో ఎక్కువగా మాట్లాడేవాడని చెప్పింది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన సుకేశ్ చంద్రశేఖర్ ను పోలీసులు గతంలోనే అరెస్టు  చేశారు. అతనిని విచారించిన తరువాత పోలీసుల షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. పైకి చూడ్డానికి మాములుగానే ఉన్నా తాను పలుకుబడి ఉన్న వ్యక్తినని, తనకు పెద్ద పెద్ద నాయకులతో  మంచి సంబంధాలున్నాయని కలరింగ్ ఇస్తారు.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో  వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని, అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు.  ఈ డబ్బుతో చెన్నైలోని ఓ బంగ్లా ను కొన్నట్లు వారు పేర్కొన్నారు.

సుకేష్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇటు నోరా ఫతేహిలను ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు కాదని వీరిద్దరినీ వదిలేశారు. ఈ కేసులో తాజాగా  సెప్టెంబర్ 26న భౌతికంగా హాజరు కావాలని నటి జాక్వెలిన్ కు ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News