అస్సాం లేడీస్ తడాఖా చూసిన రాహుల్ గాంధీ

Update: 2015-12-14 08:56 GMT
 దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు ఆయన... భవిష్యత్తులో భారత దేశానికి ప్రధాని అయినా కావొచ్చు.. అలాంటి రాహుల్ గాంధీ దేశంలోని ఓ గుడిలోకి అడుగుపెట్టలేకపోయారట. ఈ సంగతి స్వయంగా ఆయనే చెప్పారు.. అయితే... ఇదంతా ఆరెస్సెస్ కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నారాయన.
   
రాహుల్ ఇటీవల అస్సాంలో పర్యటించారు. అక్కడ బార్పేట్ ఆలయంలోకి ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ, ఊళ్లోని మహిళలంతా ఆలయం ప్రధాన ద్వారం ఎదుట చేరి రాహుల్ ను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేదో నిరసనలా కాకుండా వారు అక్కడ చేరి కదలకుండా రాహుల్ గాంధీని లోనికి వెళ్లకుండా చేశారు. దీంతో రాహుల్ మొఖం మాడ్చుకుని బయటకు వచ్చేశారు.
   
తాజాగా సోమవారం ఆయన పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. ఆరెస్సెస్ నేతలు ఇలా వ్యూహం రచించి తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలన ఎలా ఉందో చూడండంటూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. అయితే... కేంద్రంలో బీజేపీలో ఉన్నా అస్సాంలో అధికారంలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. మరి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ చేతకానితనంపై ఒక్క మాట కూడా అనకుండా ఎక్కడో ఢిల్లీలో ఉన్న బీజేపీని విమర్శించడమేంటో రాహుల్ కే తెలియాలి.
Tags:    

Similar News